” పాకిస్తాన్ జిందాబాద్ ” వ్యాఖ్యలు చేసిన యువతి గురించి పూర్తీ వివరాలు తెలిస్తే షాక్

కర్ణాటక రాజధాని బెంగళూరులో ఫిబ్రవరి-20,2020 న సీఏఏ,ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ అధ్యక్షతన ‘సేవ్‌ కాన్‌స్టిట్యూషన్‌’ పేరుతో సభ జరిగింది. ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ సహా పలువురు ఈ ర్యాలీకి హాజరయ్యారు. అయితే సభా వేదికపై ఓవైసీ సమక్షంలో పాకిస్తాన్ జిందాబాద్ అంటూ ఓ యువతి నినాదాలు చేసింది. ఒవైసీ వస్తుండగానే వేదికపైకి వచ్చిన అమూల్య లియోనా అనే యువతి ‘పాకిస్తాన్‌ జిందాబాద్‌’ అని నినాదాలు చేయడం ప్రారంభించింది. ఆందోళనకారులను కూడా తనతో పాటు నినాదించమని కోరింది. దీంతో వేదికపై ఉన్న వారంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. యువతి అలాగే పలుమార్లు నినాదం చేస్తుండటంతో అసదుద్దీన్ ఓవైసీ వెనక్కి వచ్చి మైక్ లాక్కునేందుకు ప్రయత్నించారు. అయినా కూడా ఆ యువతీ వినిపించుకోకుండా, అలాగే నినాదాలు చేస్తూ పోయింది. నిర్వహకులు ఆపడానికి ప్రయత్నిస్తుంటే చివరకీ ‘హిందూస్థాన్ జిందాబాద్’ అని మాట మార్చింది. అయినప్పటికీ ఆమె నుంచి మైక్ లాక్కోవడంతో పాటు వెనక్కి తీసుకెళ్లిపోయారు పోలీసులు. అనంతరం ఆమెను రాజద్రోహం కేసులో అరెస్ట్ చేసి 14రోజుల జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు.

ఈ క్రింది వీడియో చూడండి

ఈ నేపథ్యంలో అమూల్య తీరుపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు పెల్లుబుకుతున్నాయి. ఈ విషయం గురించి కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప మాట్లాడుతూ.. అమూల్యకు బెయిలు ఇవ్వకూడదని పేర్కొన్నారు. ఆమె తండ్రి సైతం తనను రక్షించేందుకు సిద్ధంగా లేనని చెప్పారన్నారు. అలాగే అమూల్య లియోనాకు నక్సలైట్లతో సంబంధాలు ఉన్నాయని కర్ణాటక సీఎం యడియూరప్ప సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాంటి వ్యాఖ్యలు చేసిన అమూల్య తప్పనిసరిగా శిక్షించబడాల్సిందేనన్నారు యడ్యూరప్ప. అమూల్య తండ్రే తన కూతరు కాళ్లు, చేతులు విరగగొట్టమని చెప్పారని, తన కూతురుకి బెయిల్ కూడా పొందకూడదని, తాను ఏమాత్రం తన కూతరుకి అండగా నిలబడనని ఆయన చెప్పినట్లు యడియూరప్ప తెలిపారు.

Image result for bangalore amulya

ఇక అమూల్య వ్యాఖ్యలకు నిరసనగా.. శ్రీరామ్‌ సేన, హిందూ జాగృతి సమితిసభ్యులు ఆందోళన చేపట్టారు. అమూల్య క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా అమూల్య వంటి వ్యక్తుల వెనుక ఉన్నగ్రూప్ లు, అముల్య మాదిరిగా పెరుగుతున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేస్తున్నారు. అమూల్య తండ్రి మాట్లాడుతూ…తన కూతరు పెద్ద తప్పు చేసింది. కొంతమంది ముస్లింలతో చేరి నా మాట వినడం లేదు. ఆమెకు ఎలాంటి శిక్ష వేసినా పర్వాలేదు అని ఆయన తెలిపారు. ఇదిలా ఉండగా.. అమూల్య ఇంటిపై కొంతమంది వ్యక్తులు రాళ్లతో దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. కాగా అమూల్య వ్యాఖ్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు అసదుద్దీన్‌ ఒవైసీ తెలిపారు. ఇక అమూల్యను చిక్కమగళూరు జిల్లా కొప్పా తాలూకా శివపుర గ్రామవాసిగా పోలీసులు గుర్తించారు. అలాగే అమూల్యను ఆ కార్యక్రమానికి ఎవరు ఆహ్వానించారు.. పాకిస్తాన్‌ కు అనుకూలంగా నినాదాల వెనుక కారణాలేవైనా ఉన్నాయా? అన్న కోణాల్లో విచారణ జరుగుతోంది.

ఈ క్రింది వీడియో చుడండి

Content above bottom navigation