ఏపీలో సకలం బంద్.. ఉద్యోగులకు జగన్ సర్కార్ బంపరాఫర్

122

జయహో జనతా కర్ఫ్యూ యావత్ దేశం. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ స్వచ్చంధ బంద్ కొనసాగనుంది. ప్రధాని మోదీ పిలుపుతో అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కలిసికట్టుగా ముందుకొచ్చాయి.. జనతా కర్ఫ్యూకు చేయి, చేయి కలిపాయి. ఏపీలో జగన్ సర్కార్ కూడా ప్రజల సహకారంతో కర్ఫ్యూను విజయవంతం చేయాలని పిలుపునిచ్చింది. ఇప్పటికే ఆర్టీసీ బస్సులు నిలిపివేయగా.. పెట్రోల్ బంక్లు కూడా మూతపడ్డాయి. ప్రజలంతా సంపూర్ణంగా జనతా కర్ఫ్యూకు మద్దతు పలికారు.

విజయవాడతో పాటూ మిగిలిన నగరాలు, పట్టణాల్లో ఉదయం ఆరు గంటల నుంచే జనతా కర్ఫ్యూ ప్రభావం కనిపిస్తోంది. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని ప్రభుత్వం పిలుపునివ్వడంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. శనివారమే ప్రజలు ఆదివారం కర్ఫ్యూకు సంబంధించి ప్రిపరేషన్లు చేసుకున్నారు.. నిత్యావసరాలకు ఇబ్బంది లేకుండా ముందుగానే తగినట్లు ఏర్పాట్లు చేసుకున్నారు.

Image result for cm ap

వాహనదారుల్ని వెనక్కు పంపుతున్నారు పోలీసులు
విజయవాడ బెంజ్ సర్కిల్లో బయటకు వచ్చిన వాహనదారులను వెనక్కి పంపారు
ప్రజా ప్రతినిధులు కూడా ఇళ్లకే పరిమితం అయ్యారు.
తాజాగా ఓ జీవో జారీ చేసింది జగన్ ప్రభుత్వం.
ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ చేయడానికి అవకాశం ఇచ్చారు.
ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైతే దగ్గరలోని పోలీసులు, అధికారులకు సమాచారం ఇవ్వండి అని తెలిపారు
ఇళ్లలోనే జనం ఉండటంతో .. రోడ్డులన్నీ నిర్మానుష్యంగా మారాయి.
రాష్ట్రంలో వర్క్ ఫ్రం హోం చేసే వారికి అంతరాయం కలగకుండా ఇంటర్ నెట్ సదుపాయం కల్పిస్తామన్నారు

Image result for cm ap


రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు స్టేషన్లో అందుబాటులో ఉండాలని డీజీపీ సవాంగ్ సూచన చేశారు
ముందు జాగ్రత్తగా అంబులెన్సులు, 108లు సిద్ధంగా ఉంచిందిఏపీ సర్కార్
గ్రామ, వార్డు సచివాలయాల నుంచి ధరలపై ఎప్పటికప్పుడు మానిటర్ ఉంటుంది.
నిత్యవసరాల ధరలు పెంచితే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది.
అత్యవసరాలకు మాత్రం బంద్ నుంచి మినహాయింపు ఇచ్చారు.
ఆర్టీసీ బస్సులు డిపోలకి పరిమితం అయ్యాయి..

హైదరాబాద్‌ను చుట్టేసిన 69వేల మంది విదేశీ ప్రయాణికులు

జబర్దస్త్ లో రియల్ ఫైట్… కొట్టుకున్న భాస్కర్, అప్పారావు ..

కరోనా వైరస్ జీవిత కాలం ఎంత? ఎన్ని రోజులు ?

Content above bottom navigation