AP లో 87 కు చేరిన కరోన కేసులు జగన్ సంచలన నిర్ణయం

157

ఏపీలో కరోనా వైరస్ పంజా విసురుతోంది. కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ ఒక్కరోజే 43 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 87కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బుధవారం(ఏప్రిల్ 1,2020) వెల్లడించింది. నిన్న(మార్చి 31,2020) రాత్రి 9 గంటల నుంచి బుధవారం ఉదయం 9 గంటల మధ్య 43 కొత్త కేసులు నమోదైనట్లు తాజా బులిటెన్ లో తెలిపింది. ఇద్దరి ఆరోగ్య పరిస్థితి మెరుగైనట్లు వెల్లడించింది. గత 12 గంటల వ్యవధిలో 373 మంది నమూనాలను పరీక్షించగా.. అందులో 330 నెగిటివ్ గా నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు. 

ఈ ఒక్క రోజే నమోదైన 43 కేసుల్లో తొలిసారిగా కడప జిల్లాలో 15, పశ్చిమగోదావరి జిల్లాలో 13 కొత్త కేసులు నిర్ధారణ అధికారులు తెలిపారు. చిత్తూరు జిల్లాలో 5, ప్రకాశం జిల్లాలో 4, తూర్పుగోదావరి జిల్లాలో 2, నెల్లూరు జిల్లాలో 2 కేసులు నమోదయ్యాయి. కృష్ణా, విశాఖ జిల్లాల్లో ఒక్కొక్క కేసు నమోదైంది. నిన్నటివరకు కడప, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్క కరోనా కేసుల కూడా లేదు. అలాంటిది ఒక్క రోజులోనే కడపలో 15, పశ్చిమగోదావరి జిల్లాలో 13 కేసులు నిర్ధారణ కావడం కలకలం రేపుతోంది. కరోనా సోకిన వారంతా ఢిల్లీ మత ప్రార్థనల్లో పాల్గొని వచ్చిన వారేనని తెలుస్తోంది.

మార్చి 31 రాత్రి 9 నుంచి ఏప్రిల్ 1 ఉదయం 9 వరకు నమోదైన 43 కేసులు
* తొలిసారిగా కడప జిల్లాలో 15 కేసులు నమోదు
* పశ్చిమగోదావరి జిల్లాలో 13 కేసులు
* చిత్తూరు జిల్లాలో 5, తూ.గో.జిల్లాలో 2, కృష్ణా జిల్లాలో 1, నెల్లూరు జిల్లాలో 2 కేసులు నమోదు
* ప్రకాశం జిల్లాలో 4, విశాఖలో 1 కేసు నమోదు

జిల్లాల వారీగా నమోదైన కేసుల వివరాలు:

1

* ప్రపంచవ్యాప్తంగా 203 దేశాలకు పాకిన కరోనా వైరస్
* ప్రపంచవ్యాప్తంగా 8లక్షల 56వేల 917 కరోనా పాజిటివ్ కేసులు, 42వేల 158 మరణాలు
* ప్రపంచవ్యాప్తంగా కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 1,78,100
* ఇటీలీలో లక్ష 5వేల 792 కరోనా కేసులు.. 12,428 మరణాలు
* స్పెయిన్ లో 95వేల 923 కేసులు.. 8,464 మరణాలు
* అమెరికాలో లక్ష 87వేల 347 కేసులు, 4వేల మరణాలు
* ఫ్రాన్స్ లో 52వేల 128 కేసులు.. 3,523 మంది మరణాలు

* చైనాలో 81వేల 518 కేసులు… 3,305 మరణాలు
* ఇరాన్ లో 44వేల 605 కేసులు.. 2,898 మరణాలు
* యూకేలో 25వేల 150 కేసులు.. 1,789 మరణాలు
* నెదర్లాండ్ లో 12వేల 595 కేసులు.. 1,039 మరణాలు
* జర్మనీలో 71వేల 808 కేసులు.. 775 మరణాలు
* బెల్జియంలో 12వేల 775 కేసులు.. 705 మరణాలు
* స్విట్జర్లాండ్ లో 433 మంది, టర్కీలో 214 మంది కరోనాతో మృతి

* భారత్ లో 1,637 కు చేరిన కరోనా కేసుల సంఖ్య, 52కి చేరిన కరోనా మరణాలు
* దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 142
* మహారాష్ట్రలో 320 కరోనా కేసులు, 12 మరణాలు
* కేరళలో 241 కేసులు, రెండు మరణాలు
* తమిళనాడులో 124 కేసులు, ఒకరు మృతి
* ఢిల్లీలో 120 కేసులు, ఇద్దరు మృతి
* కర్నాటకలో 101 కేసులు, మూడు మరణాలు
* గుజరాత్ లో 74 కేసులు, ఆరు మరణాలు
* యూపీలో 108 కేసులు
* మధ్యప్రదేశ్ లో 86 కేసులు, నాలుగు మరణాలు
* జమ్ముకశ్మీర్ లో 55 కేసులు, రెండు మరణాలు
* పంజాబ్ లో 41 కేసులు, 4 మరణాలు
* బెంగాల్ లో 32 కేసులు, మూడు మరణాలు
* హరియానాలో 25 కేసులు
* బీహార్ లో 21 కేసులు, ఒకరు మృతి
* చండీగడ్ లో 13, లఢఖ్ లో 13 కేసులు, అండమాన్ లో 10,  చత్తీస్ గడ్ లో 9,  ఉత్తరాఖండ్ లో 7, గోవాలో 5, ఒడిశాలో 4 కేసులు
* రాజస్థాన్ లో 93 కేసులు
* హర్యానాలో 43 కేసులు
* హిమాచల్ ప్రదేశ్ లో 3 కేసులు, ఒకరు మృతి
* మణిపూర్, మిజోరం, ఝార్ఖండ్, అసోం, పుదుచ్చేరిలో ఒక్కో కేసు నమోదు
* ఏపీలో 87 కరోనా కేసులు
* తెలంగాణలో 97 కరోనా కేసులు, ఆరు మరణాలు, 14మంది డిశ్చార్జ్ 

Content above bottom navigation