నివర్ తుఫాన్ కారణంగా ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో నిన్నటి నుండి ఎడతెరపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా రాష్ట్రంలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.
ఈ క్రమంలో చిత్తూరు జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఐరాల మండలంలో ఓ కారు వాగులో కొట్టుకుపోయింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న వైసీపీ నేత వినయ్ రెడ్డి మృతి చెందాడు. దీనికి సంబందించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం