Saturday, June 19, 2021

ఫుల్ గా తాగి పెళ్ళిలో వధువుకి బదులు అత్త మెడలో తాళి..!

Must Read

పెళ్లిలో వింతైన సంఘటనలు ఎన్నో చూసుంటారు.. కాని ఇక్కడ పెళ్ళిలో వరుడు చేసిన బిత్తిరి పనికి వచ్చిన అతిథులంతా షాకయ్యారు. అతగాడి వాలకం చూసి.. పెళ్లి రోజే ఇలా ఉంటే.. ఇక పెళ్లి తర్వాత మా అమ్మాయి పరిస్థితి ఏంటో అనిఅనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆ వరుడు చేసిన ఘనకార్యానికి సంబంధించిన వీడియో నెట్లో బాగా వైరల్ అవుతుంది. ఆ వీడియో గురించి తెలియాలంటే మీరే చదవండి.

నిరంజన్‌ మహామాత్ర అనే వ్యక్తి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన ఈ వీడియోలో పెళ్లి జరుగుతుంటుంది. ఇక పెళ్లి కొడుకు తప్పతాగి పెళ్లి మండపంలో కూర్చుంటాడు. ఫుల్లుగా తాగి ఉండటంతో దండలు మార్చుకునే సమయంలో.. పెళ్లి కూతురికి బదులు ఆమె తల్లి.. కాబోయే అత్త మెడలో దండ వేయబోతాడు. పక్కనున్న వారు ప్రమాదాన్ని గ్రహించి పెళ్లికొడుకుని వెంటనే హెచ్చరిస్తారు.. వెంటనే మత్తులోంచి తెరుకుంటాడు వరుడు.

ఆ తర్వాత అతడి స్నేహితులు అతడిని పట్టుకుని.. వధువు మెడలో దండ వేయించే ప్రయత్నం చేస్తారు. కానీ ఫుల్లుగా తాగి ఉండటంతో వధువు మెడలో వరమాల వేయకుండానే స్టేజీ మీదే కింద పడిపోతాడు. పెళ్లికి వచ్చిన వారంతా వరుడి బిత్తరి చర్యకు షాక్‌ అయ్యారు. ఈ సంఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగింది అనే దాని గురించి ఎలాంటి వివరాలు లేవు. ఇప్పుడు ఈ వీడియో చూసిన వారంతా పెళ్లి రోజు వీడికి ఇదేం పోయేకాలం అని ముక్కున వేలేసుకుంటున్నారు.

Latest News

వ్యాక్సిన్ తీసుకున్నాక ఆ పని చేయ‌వ‌చ్చా?

క‌రోనా కేసులు క్ర‌మంగా తగ్గుముఖం ప‌డుతున్నాయి. వ్యాక్సినేష‌న్‌ను వేగవంతం చేయ‌డంతో క్ర‌మంగా కేసులు తగ్గుతున్నాయి. అయితే, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక వ్యాయామం చేస్తే ఏమౌతుంది అనే...

More Articles Like This