Friday, July 30, 2021

హైద‌రాబాద్‌లో ఒక వ్యక్తి వాహ‌నానికి 130 చ‌లాన్లు…

Must Read

వాహనానికి ఒకటి.. రెండు… మూడు చలానాలు అంటే సర్వసాధారణం. కాని హైద‌రాబాద్‌లో ఒక వ్యక్తికి ఏకంగా 130 చ‌లాన్లు ఉన్నాయి. అది పోలీసులు చూసి షాక్ తిన్నారు. ఆ స్కూటీని చెక్ చేయ‌గా గత నాలుగు సంవత్సరాల నుంచి చలానాలు ఉన్నట్లు పోలీసులకు తెలిసింది. ఆ వ్యక్తి చలానాలకు కట్టకపోవడంతో పోలీసులు అతని వాహ‌నాన్ని సీజ్ చేశారు.

హైద‌రాబాద్‌లో పోలీసులు వాహ‌నాల‌పై దృష్టిసారించారు. నిత్యం ప‌లు ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు వాహ‌నాల‌ను త‌నీఖీలు చేస్తున్నారు. పెండింగ్‌లో ఉన్న చ‌లానాల‌ను వ‌సూలు చేస్తున్నారు. ఈ క్ర‌మంలో, జూబ్లీహిల్స్‌లోని చెక్‌పోస్ట్ వ‌ద్ద ఓ వాహ‌నాన్ని ఆపి చెక్ చేయ‌గా ఆ వాహ‌నంపై దాదాపుగా 130 చ‌లాన్లు ఉన్నాయి. టీఎస్ 10 ఈఆర్ 7069 నెంబ‌ర్ గ‌ల స్కూటీని చెక్ చేయ‌గా 2017 నుంచి చ‌లానాలు పెండింగ్ లో ఉన్న‌ట్టు పోలీసులు గుర్తించారు. అయితే, ఈ చ‌లానాల మొత్తం రూ.35,950 చెల్లించాల‌ని పోలీసులు కోరారు. అందుకు వాహ‌న‌దారుడు అంగీక‌రించ‌క‌పోవ‌డంతో వాహ‌నాన్ని పోలీసులు సీజ్ చేశారు.

Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...

More Articles Like This