Friday, July 30, 2021

ఒకప్పుడు భారతావనిలోని ఉన్న ఆప్ఘనిస్థాన్ లో శివుడిపేరుతో సరస్సు

Must Read

ఒకప్పుడు అఖండ భారతంలో ఇప్పటి పాకిస్తాన్‌,భారతదేశం , బంగ్లాదేశ్, బర్మా, టిబెట్, ఆఫ్గనిస్తాన్, శ్రీలంక, నేపాల్, భూటాన్ లు కలిసి ఉండేవి. అప్పుడు ఈ దేశాలన్నీ సనాతన ధర్మం ఆచరించాయి. అందుకు సాక్ష్యాలుగా అనేక గుర్తులు ఉన్నాయి. అంటే బ్రిటిష్ కు ముందున్న భారతదేశం. బ్రిటీష్ వాళ్ళు విశాల దేశాన్ని పాలించి, కొన్ని దేశాలుగా చీల్చి స్వతంత్రం ఇచ్చి పోయారు.

శివుడి పేరుతో కోల్ -ఇ -శివ లేదా వొజేరొ శివ పేరుతో ఓ సరస్సు ఆఫ్ఘనిస్తాన్ లోని తజకిస్థాన్ సరిహద్దుల దగ్గర ఉంది. ఆ నదిని ఇప్పటికీ శివుడి పేరుతోనే పిలుస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్ , తజకిస్థాన్ సరిహద్దుల్లో ఒకప్పుడు అంటే 1వ శతాబ్దము నుండి 10వ శతాబ్దము వరకు సనాతన ధర్మం ఆచరించబడ్డది అదీ చాలా విస్తృతంగా. కుడ్య చిత్రాలు, ఫ్రెస్కో లు (అంటే అప్పుడే వేసిన సున్నం మీద చిత్రాలు గీయడాన్ని ఫ్రెస్కో అంటారు) అవి ఇప్పటికీ తజకిస్థాన్ , ఉబ్జెకిస్తాన్, ఇరాన్, రష్యా లోని మారు మూల ప్రాంతాలలో కనిపిస్తాయి. అయితే ఈ కుడ్య చిత్రాలు పూర్తిగా శివుడి మీద ఆధారపడి గీసినవే. పేర్లు మాత్రం అక్కడి స్థానిక భాషలో ఉంటాయి కానీ సనాతన ధర్మం ని ఆచరించారు అనే దానికి సజీవ సాక్ష్యాలని కొందరి పురాతత్వ శాస్త్రజ్ఞులు చెబుతున్నారు.

ఇప్పుడున్న దేశాలు 2వేల క్రితం ఉనికిలో లేవు. తజకిస్థాన్ లో శివాలయాన్ని పాంజకెంట్ దేవాలయం గా పిలిచేవారు. వర్తక, వాణిజ్యం చేసే సొగ్దియన్ల హయాంలోనే కుడ్య చిత్రాలు గీయబడ్డాయి అలాగే శివ సరస్సు ని పేరు వాళ్ళే పెట్టారు. సొగ్దియన్లు చైనాతో కాకుండా భారత దేశంతో కూడా బలమయిన సంబంధాలని కలిగి ఉన్నారు అందుకె హిందూ ధర్మ శాంప్రాదాయాలు తో పాటు శివుడిని కూడా పూజించారు. వాళ్ళ గోడల మీద ఉన్న బొమ్మలని చూస్తే అర్ధం అవుతుంది. వేష్పార్కర్ అని శివుడిని పిలిచేవారు సొగ్దియన్లు.

గతంలో 10 వ శతాబ్దం నుండి ప్రారంభం అయిన ముస్లిం దండయాత్రలలో మధ్య ఆసియా తో పాటు దాదాపుగా వాళ్ళు వెళ్ళిన ప్రదేశాలలో ఉన్న గుళ్ళు,గోపురాలని నెల మట్టం చేశారు కాబట్టి అక్కడ సనాతన ధర్మ ఆనవాళ్ళు ఇప్పుడు కనిపించవు. అయితే ఇప్పటికి ప్రపంచ వ్యాప్తంగా అనేక విగ్రహాలు కనిపిస్తూనే ఉంటాయి.

Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...

More Articles Like This