Wednesday, June 23, 2021

కోటయ్య మాష్టారి మృతి పై ఆనందయ్య షాకింగ్ రియాక్షన్..

Must Read

ఆనందయ్య మందు గురించి సోషల్ మీడియా లో ఎంత పెద్ద రచ్చ జరిగిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన ఇచ్చిన మందు వాడి కోలుకున్న వెంటనే హుషారుగా చెప్పిన కోటయ్య మాష్టారి వీడియో ఎంతలా వైరల్ అయ్యిందో అందరికి తెలిసిందే. కరోనా కారణంగా తీవ్ర అనారోగ్యానికి గురై.. అప్పటివరకు వాడిన ఇంగ్లీష్ మందులను పక్కన పెట్టి ఆనందయ్య మందు కోసం రావటం.. మందు వేసుకున్న వెంటనే ఆక్సిజన్ లెవెల్స్ పెరిగి హుషారుగా ఆనందయ్య మందును పొగిడేయటం అందరూ చూసారు.

అయితే ఆనందయ్య మందు వేసుకున్న కొద్ది రోజులకు కోటయ్య తీవ్ర అనారోగ్యానికి గురి అయ్యారు.. ఆయన్ను హాస్పిటల్లో చేర్చి వైద్యం చేయించారు. కాని తాజాగా ఆయన మరణించారు. దీంతో ఆనందయ్య మందుపై పెద్ద ఎత్తున్న నెగెటివ్ ప్రచారం మొదలుపెట్టాయి కొన్ని మీడియా చానల్స్. ఇదిలా ఉంటే.. ఏపీ ప్రభుత్వం ఆనందయ్య మందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఇప్పుడు సంచలనమైనది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆనందయ్యను కోటయ్య మాష్టారి మృతిపై సమాధానం ఇవ్వాలని కోరారు.

దీనిపై మాట్లాడిన ఆనందయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. కోటయ్య మాష్టారు మే 16.. 17 తేదీల్లో తన వద్దకు వచ్చి మందు తీసుకున్నారన్నారు. ఆ వెంటనే కోలుకొని ఇంటికి వెళ్లారని.. ఆ తర్వాత ఆయన మళ్లీ ఆసుపత్రిలో చేరాడన్నారు. హాస్పిటల్లో ఏ మందులు తీసుకున్నారో? ఎలాంటి వైద్యం తీసుకున్నారో తనకు తెలీదని.. ఆ వైద్యం వికటించటం వల్లే ఆయన మృతి చెంది ఉండొచ్చు అని ఆనందయ్య సంచలన ఆరోపణలు చేసారు.

ఆనందయ్య మందును కోటయ్య మాష్టారు మే16న తీసుకుంటే.. ఆయన మరణం మే 30న చోటు చేసుకుంది. అయితే ఈ 14 రోజుల్లో ఏం జరిగింది? అనేది కూడా కీలకమే. దీనిపై మరింత లోతైన అధ్యయనం చేసిన తర్వాతే.. ఏదైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Latest News

ఆనందయ్య మందు ఫిలింఛాంబర్‌లో పంపిణీ. ఏ విధంగా వేసుకోవాలి, ఏం తినకూడదో చెప్తూ వివరణ

సినీ ఇండస్ట్రీలో చాలా మంది ఆనందయ్య మందు పంపిణి చేయమని కోరుతున్నారు. అందరి కోరిక మేరకు కరోనా నియంత్రణలో భాగంగా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్...

More Articles Like This