Saturday, June 19, 2021

చందమామ హీరోయిన్ సింధు మీనన్ ఎలా మారిపోయిందో మీరే చూడండి

Must Read

చాలా హోమ్లీగా అనుకువగా పక్కింటి అమ్మాయి మాదిరిగా ఉండే సింధు మీనన్ ప్రస్తుతం సినిమాలను పూర్తిగా మానేసింది. ఆమె ప్రస్తుతం భారత దేశంలో కూడా ఉండడమే లేదు. ఈ నేపథ్యంలో అసలు ఆమె ఎక్కడ ఉన్నారు ఎం చేస్తున్నారు ఆమె జీవిత విశేషాలు, ప్రస్తుతం లైఫ్ ఎలా ఉందొ ఒకసారి తెలుసుకుందాం. సింధు మీనన్ బెంగళూరు లో నివసించే ఒక మలయాళీ కుటుంబానికి చెందిన వారు. మాతృభాష మలయాళం అయినప్పటికీ సింధు మీనన్ పుట్టిపెరిగింది మొత్తం బెంగళూరులోనే.

సింధు మీనన్ చిన్నప్పటి నుండే భరతనాట్యం నేర్చుకున్నారు. ఒక భరతనాట్యం కాంపిటీషన్ లో పాల్గొని అందులో విజేతగా నిలిచారు సింధు మీనన్. ఆ కాంపిటీషన్ కి జడ్జ్ అయిన భాస్కర్ హెగ్డే సింధూ మీనన్ ని కన్నడ డైరెక్టర్ కె.వి.జయరామ్ కి పరిచయం చేశారు. 1994లో జయరామ్ దర్శకత్వం వహించిన రష్మీ అనే సినిమాతో బాల నటి గా సినిమా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు సింధు మీనన్.

తర్వాత మరో రెండు సినిమాల్లో నటించారు. 1999లో ప్రేమ ప్రేమ ప్రేమ అనే కన్నడ చిత్రం ద్వారా హీరోయిన్ గా కెరియర్ ను మొదలు పెట్టారు. 2001లో వచ్చిన, రియల్ స్టార్ శ్రీహరి గారు నటించిన భద్రాచలం సినిమా తో తెలుగు తెరకు పరిచయం అయ్యారు సింధు మీనన్. చందమామ లో తన నటనకు ఎన్నో ప్రశంసలు అందుకున్నారు సింధు మీనన్. 2009 లో వచ్చిన డబ్బింగ్ చిత్రం వైశాలి ద్వారా తెలుగు ప్రజలకు ఇంకా దగ్గరయ్యారు. 2012లో వచ్చిన తెలుగు చిత్రం సుభద్ర సింధు మీనన్ నటించిన చివరి చిత్రం. ఆ తర్వాత మరే సినిమా లోనూ నటించలేదు.

ఇంతకు ఈ అమ్మడు పెళ్లి ఎవర్ని చేసుకుందో తెలుసా? లండన్ లో సెటిల్ అయిన తెలుగు టెక్కీ డొమినిక్ ప్రభుని ప్రేమించి వివాహమాడింది. ఆమెకు ఇద్దరు పిల్లలు. పాప స్వెత్లానా, ఒక బాబు. ఇప్పుడు ఆమె కుటుంబంతో కలిసి లండన్ లోనే నివసిస్తుంది. పెళ్లయిన తరువాత కూడా కొద్దీ కాలం పాటు చిత్రాల్లో నటించిన సింధు ఆతరువాత వాటికి ఫుల్ స్టాప్ పెట్టేసింది. 2012 నుంచి ఆమె ఎటువంటి చిత్రాలను కానీ, టీవీ షోస్ కానీ చేయలేదు. ప్రస్తుతం పీలా పాపలతో భర్తతో హ్యాపీగా లండన్ లో లైఫ్ ని లీడ్ చేస్తుంది.”

Latest News

వ్యాక్సిన్ తీసుకున్నాక ఆ పని చేయ‌వ‌చ్చా?

క‌రోనా కేసులు క్ర‌మంగా తగ్గుముఖం ప‌డుతున్నాయి. వ్యాక్సినేష‌న్‌ను వేగవంతం చేయ‌డంతో క్ర‌మంగా కేసులు తగ్గుతున్నాయి. అయితే, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక వ్యాయామం చేస్తే ఏమౌతుంది అనే...

More Articles Like This