Saturday, June 19, 2021

లైవ్ లో శ్రీముఖి మాట్లాడిన ఈ మాటలు వింటే మీ మైండ్ బ్లాంక్ అయిపోద్ది

Must Read

యాంకర్ శ్రీముఖి.. ఈ పేరు వింటేనే ఆమె చేసే అల్లరి చక్కిలిగిలి పెడుతుంది. ‘పటాస్’ కార్యక్రమంతో అభిమానులను సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఒక్క పక్క టీవీ షోస్ తో బుల్లితెర మీద బిజీ గా గడుపుతూనే మరో పక్క సినిమాల్లో నటిస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతుంది శ్రీముఖి, ఇప్పటి వరుకు ఈమె టాలీవుడ్ లో నేను శైలజ, జులాయి, సావిత్రి, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ప్రేమ ఇష్క్ కాదల్, జెంటిల్ మ్యాన్ మరియు బాబు బాగా బిజీ వంటి సినిమాల్లో నటించింది.

హీరోయిన్ కి ఏమాత్రం తీసిపోని పర్సనాలిటీ తో ఉన్న శ్రీ ముఖికి పాపం సినిమాల్లో హీరోయిన్ గా నటించే అవకాశాలు మాత్రం రావట్లేదు అనే చెప్పాలి. ఇప్పటి వరుకు ఈమె కేవలం క్యారక్టర్ ఆర్టిస్టుగా మాత్రమే చేసింది,వాటిల్లో కూడా ఆమెకి ఇప్పటి వరుకు గుర్తు ఉండి పొయ్యే రోల్స్ రాలేదు అనే చెప్పాలి. బుల్లితెర పై ఈమెతో సమానమైన క్రేజ్ ఉన్న అనసూయ మరియు రష్మీ లు మాత్రం సినీ రంగం లో కూడా రాణిస్తున్నారు, ఇక అనసూయ కి అయితే రంగమ్మ అత్త లాంటి జీవితాంతం గుర్తు ఉండిపొయ్యే పాత్రలు పడుతున్నాయి, మరి భవిష్యత్తు లో అయినా శ్రీముఖి కి హీరోయిన్ గా నటించే అవకాశాలు కానీ, లేదా ప్రేక్షకులు ఎప్పటికి మర్చిపోలేని పాత్రల్లో నటించే అవకాశం కానీ దక్కుతుందో లేదో చూడాలి, ఇది ఇలా ఉండగా ఇటీవల ఈమె తన ఇంస్టాగ్రామ్ మరియు పేస్ బుక్ అకౌంట్స్ ద్వారా పెట్టిన ఒక్క వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది, ఆమె ఆ వీడియో లో ఏమి మాట్లాడిందో ఇప్పుడు చూద్దాం.

ఢీ షో ద్వారా బాగా పాపులర్ అయిన డాన్సర్ పండు మెల్లిగా ఇప్పుడు సినిమాల్లో పాటలకు కొరియోగ్రాఫేర్ చేసే అవకాశాలు దక్కించుకుంటున్న సంగతి మన అందరికి తెలిసిందే. ఆయన కొరియోగ్రాఫేర్ గా చేసిన తోలి సినిమా పేరు మరో ప్రేమ కథ, ఈ సినిమా లో ఇటీవల విడుదల అయిన నల్లని కాటుక అనే పాటకి సోషల్ మీడియాలో అద్భుతమైన రెస్పాన్స్ వస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే. ఈ పాటకి పండు కొరియోగ్రాఫేర్ గా చేసాడు, అయితే అతనికి శుభాకాంక్షలు తెలుపుతూ యాంకర్ శ్రీముఖి మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి, ఆమె మాట్లాడుతూ’హాయ్ ఫ్రెండ్స్, రుద్రా క్రాంతి ఆర్ట్స్ క్రియేషన్స్ లో వస్తున్న మరో ప్రేమ కథ చిత్రం లో మా పండు గాడు నల్లని కాటుక అనే పాటకి కొరియోగ్రఫీ చేసాడు, ఈ పాట ఇటీవలే యూట్యూబ్ లో విడుదల అయ్యి మంచి రెస్పాన్స్ ని తెచ్చుకుంది, నేను కేవలం పండు గాడి కోసం ఈ పాట చూడడం జరిగింది, చాలా బాగా కొరియోగ్రాఫ్ చేసాడు, పండు ఇలాగె అద్భుతంగా కొరియోగ్రఫీ చేస్తూ ఇండస్ట్రీ లో గొప్ప డాన్స్ మాస్టర్ గా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, ఆల్ ది బెస్ట్ పండు, లవ్ యూ అంటూ అల్లరి చేసింది.

Latest News

వ్యాక్సిన్ తీసుకున్నాక ఆ పని చేయ‌వ‌చ్చా?

క‌రోనా కేసులు క్ర‌మంగా తగ్గుముఖం ప‌డుతున్నాయి. వ్యాక్సినేష‌న్‌ను వేగవంతం చేయ‌డంతో క్ర‌మంగా కేసులు తగ్గుతున్నాయి. అయితే, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక వ్యాయామం చేస్తే ఏమౌతుంది అనే...

More Articles Like This