Saturday, June 19, 2021

షాకింగ్: ఆనందయ్య మందుతో రూ.120 కోట్ల భారీ డీల్.. !

Must Read

ఆనందయ్య ఆయుర్వేద మందుపై మళ్లీ వివాదం రాజుకుంది. ఇటీవల ఆయన మందుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం నోటిద్వారా తీసుకునే మందు పంపిణీకి మాత్రమే అనుమతి ఉంది. కంటిలో వేసే మందుకు ఇంకా అనుమతి రాలేదు. దీనికి మరింత సమయం పట్టే అవకాశముంది. ఐతే నోటి ద్వారా వేసే మందును సోమవారం నుంచి పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ప్రభుత్వం పచ్చజెండా ఊపడంతో ఆనందయ్య కరోనా మందుని అమ్ముకునేందుకు స్థానిక ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి సిద్ధమయ్యారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. పేదలకు ఉచితంగా ఇస్తున్న మందుతో వ్యాపారం చేసి కోట్లు గడించేందుకు పథకం పన్నారని ఆయన ఆరోపించారు. గత నెల 21 నుంచే ఎమ్మెల్య కాకాణి కుట్రలు ప్రారంభమయ్యాయని ఆయన అన్నారు. అందుకోసం నకిలీ వెబ్‌సైట్‌ని కూడా రూపొందించారని సోమిరెడ్డి చెప్పారు. వెబ్‌సైట్‌లో మందు వివరాలు, ధరను పేర్కొన్నారని.. కానీ మళ్లీ డిలీట్ చేశారని దుయ్యబట్టారు.

వైసీపీ నేతలకు చెందిన శ్రేషిత టెక్నాలజీ వద్ద వెబ్‌సైట్ కొనుగోలు చేసి ఇంటర్నెట్‌లో హెస్ట్ కూడా చేశారని.. వెంటనే డిలీట్ చేశారని మాజీ మంత్రి ఆరోపించారు. వెబ్‌సైట్‌లో ఆనందయ్య ఉచితంగా ఇస్తున్న మందును రూ.167కు అమ్ముకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. కోటి మందికి మందుని ఆన్‌లైన్ అమ్మడం ద్వారా 120 కోట్ల రూపాయలు కొట్టేసేందుకు ఎమ్మెల్యే కాకాణి కుట్రపన్నారని సోమిరెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. నకిలీ సైట్ క్రియేట్ చేసి మోసం చేసేందుకు యత్నించిన వారిపై ప్రభుత్వం వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Latest News

వ్యాక్సిన్ తీసుకున్నాక ఆ పని చేయ‌వ‌చ్చా?

క‌రోనా కేసులు క్ర‌మంగా తగ్గుముఖం ప‌డుతున్నాయి. వ్యాక్సినేష‌న్‌ను వేగవంతం చేయ‌డంతో క్ర‌మంగా కేసులు తగ్గుతున్నాయి. అయితే, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక వ్యాయామం చేస్తే ఏమౌతుంది అనే...

More Articles Like This