Friday, July 30, 2021

హైదరాబాద్ లో వనస్థలిపురంలో దారుణం….హత్య చేసి కరోనాతో చనిపోయినట్టు చిత్రీకరణ

Must Read

కరోనా వైరస్ దేశంలో ఎంతోమంది ప్రాణాలు తీసింది. ఇది కూడా అదునుగా భావించినవారు కొందరు హత్యలు చేసి కరోనాపై నెడుతున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో దారుణం జరిగింది. భార్యను హత్యచేసి కరోనాతో మృతి చెందినట్టు చిత్రీకరించాడు భర్త. చనిపోయిన మృతదేహానికి అంత్యక్రియలు చేయించాడు భర్త.

మృతురాలు కవిత తల్లిదండ్రులకు అతని ప్రవర్తనపై అనుమానం వచ్చింది. తమ కూతురు కరోనాతో మృతి చెందలేదని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇక, రంగంలోకి దిగిన పోలీసులు కవిత మృతదేహానికి రీపోస్టుమార్టం చేయించారు. ఆమె కోవిడ్‌తో చనిపోలేదని పోస్టుమార్టం చేసిన వైద్యులు తేల్చారు. కవితను హత్య చేసి గుట్టు చప్పుడు కాకుండా ఆమె భర్త విజయ్‌ అంత్యక్రియలు నిర్వహించినట్టు గుర్తించిన రాచకొండ పోలీసులు విజయ్‌ను అరెస్ట్ చేశారు.

Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...

More Articles Like This