Thursday, June 24, 2021

బంపర్ ఆఫర్: రూ.1200 కడితే చాలు.. కొత్త బైక్ మీ సొంతం!

Must Read

మీరు కొత్త బైక్ కొనాలని ఆలోచిస్తున్నారా? ప్రస్తుతం బాగా పెరిగిపోయిన పెట్రోల్ ధరలతో అందరూ ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైక్ లపై మొగ్గు చూపుతున్నారు.. అయితే మైలేజ్ విషయానికి వస్తే ఒక ఆప్షన్ అందుబాటులో ఉంది. బజాజ్ కంపెనీ బైక్ కొనొచ్చు. బజాజ్ సీటీ 100 బైక్ అదిరిపోయే మైలేజ్ ఇస్తుందని కంపెనీ ప్రకటించింది.

మీరు రూ.6 వేలు డౌన్ పేమెంట్‌తో ఈ బైక్ కొనుగోలు చేయాలని భావిస్తే.. ఎంత EMI పడుతుందో ఒకసారి తెలుసుకుందాం. బజాజ్ సీటీ 100 ధర రూ.55 వేలు వరకు ఉంది. మీరు రూ.6 వేలు డౌన్ పేమెంట్ చెల్లిస్తే.. ఇంకా రూ.49,214 కట్టాల్సి ఉంటుంది.

మీరు బ్యాంక్ నుంచి లోన్ తీసుకోవచ్చు. 9.7 శాత వడ్డీ రేటుతో మీరు లోన్ తీసుకున్నారని అనుకుందాం. ఇప్పుడు మీకు నెలకు రూ.1765 చెల్లించాలి. మీరు ఇలా 36 నెలలు కట్టాల్సి ఉటుంది. అదే మీరు ఇంకా EMI Installment తగ్గించుకోవాలని భావిస్తే.. అప్పుడు ఐదేళ్ల టెన్యూర్ పెట్టుకోవాలి. అప్పుడు EMI రూ.1218 అవుతుంది.

ఇకపోతే బజాజ్ సీటీ 100 బైక్ ఏకంగా లీటరుకు 90 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంటోంది. కానీ ఇతర బైక్స్ కన్నా మెరుగైన మైలేజ్ ఇస్తుందని చెప్పుకోవచ్చు. మైలేజ్ కోరుకునే వారికి ఈ బైక్ కన్నా బెస్ట్ ఆప్షన్ మరొకటి లేదు.

Latest News

ఆనందయ్య మందు ఫిలింఛాంబర్‌లో పంపిణీ. ఏ విధంగా వేసుకోవాలి, ఏం తినకూడదో చెప్తూ వివరణ

సినీ ఇండస్ట్రీలో చాలా మంది ఆనందయ్య మందు పంపిణి చేయమని కోరుతున్నారు. అందరి కోరిక మేరకు కరోనా నియంత్రణలో భాగంగా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్...

More Articles Like This