Friday, July 30, 2021

బంపర్ ఆఫర్: రూ.12 రూపాయలకే సొంతిల్లు

Must Read

సొంత ఇళ్ళు కట్టుకొని అందులో జీవించాలని ఎవరికి ఉండదు చెప్పండి.. కానీ నేటి రోజుల్లో సామాన్య ప్రజలకు సొంతింటి కలను సాకారం చేసుకోవడం అనేది కేవలం కలలో మాటగానే మారిపోయింది. ఎందుకంటే ఒక సాదా సీదా ఇల్లు కట్టుకోవాలి అన్న ప్రస్తుతం లక్షలు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అయితే ఓ ఊర్లో మాత్రం ఇళ్ళని 12 రూపాయలకే సొంతం చేసుకోవచ్చు. నిజమేనండి. ఉత్తర క్రొయేషియాలో లేగ్రాడ్ అనే నగరంలో 11.83 రూపాయలకే ఇంటిని సొంతం చేసుకోవచ్చు. అక్కడి నివసించేవారిని ఆకర్షించేందుకే ఈ ఆఫర్ ను ప్రకటించామని అధికారులు వెల్లడించారు.

ఒకప్పుడు అత్యంత జనాభా నివసించిన ఈ ప్రాంతం ఇప్పుడు ప్రజలు లేక ఖాళీగా ఉంది. అందుకు కారణం గతంలో ఇక్కడ ఉన్న ప్రజలు పని కోసం వలసలకు వెళ్ళిపోయారు. శతాబ్దం క్రితం ఆస్ట్రో హంగేరియన్ సామ్రాజ్యం విఛ్చిన్నమైన తర్వాత ఇక్కడ ప్రజలు తగ్గిపోతూ వచ్చారు. దానికి తోడు సరిహద్దులు ఏర్పడటంతో ఇంకా ఎన్నో కారణాలతో ఈ ప్రదేశం నుండి వేరే ప్రదేశానికి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ ప్రాంతంలో జనాభాను పెంచాలనే ఉద్దేశ్యంతో ఖాళీ ఇళ్ళను తక్కువ ధరకు అమ్మాలని అధికారులు అనుకున్నారు. అందుకే ఒక్కో ప్రాపర్టీని ఒక కూనా అంటే డాలర్లలో 0.16 సెంట్లు చొప్పున అమ్మడం ప్రారంభమయ్యింది.

మరికొన్ని ఇళ్ళను రిపేర్లు చేయించి కొనుక్కునేవారికి అందిస్తామని మేయర్ అన్నారు. ఈ ప్రాంతంలో స్థిరపడాలనుకుంటే కొన్ని రూల్స్ కూడా పెట్టారు. ఆర్థికంగా మెరుగైన స్థితిలో ఉండి 40 సంవత్సరాల్లోపు ఉండాలి. కనీసం 15 ఏళ్ళ పాటు ఇక్కడే ఉండాలి.ఆ ఆఫర్ ఫారెన్ కంట్రీస్ వాళ్ళను బాగా ఆకర్షించింది. ఆ తర్వాత రష్యా, ఉక్రెయిన్, టర్కీ, అర్జెంటీనా,కొలంబియా లాంటి దూర ప్రాంతాల నుండి చాలామంది ఇక్కడకు వచ్చి ఇళ్ళను కొనుగోలు చేసారు.

Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...

More Articles Like This