Friday, July 30, 2021

ఢిల్లీ విమానాశ్రయంలో డ్రగ్స్ పట్టివేత..కస్టమ్స్ అధికారులు షాక్

Must Read

ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి భారీగా డ్రగ్స్ (హెరాయిన్) పట్టుబడింది. ఢిల్లీలో గతంలో ఎన్నో సార్లు మాదకద్రవ్యాలు కస్టమ్స్ అధికారులు పట్టుకోవడం జరిగింది. కాబూల్ నుండి ఢిల్లీ వచ్చిన ఆఫ్గన్ ప్రయాణీకుడి నుండి 2.4 కోట్ల విలువ చేసే 355 గ్రాముల మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు. కస్టమ్స్ అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా మాదకద్రవ్యాలను సినీ పక్కీలో తరలించే యత్నం చేశాడు ఆ కేటుగాడు. మాదక ద్రవ్యాలను కస్టమ్స్ అధికారులు కనిపెట్టకుండా కారు ఇంజన్ లో వాడే పరికరాలలో దాచాడు.

కాబూల్ నుండి మోసుకొని వచ్చిన కారు ఇంజన్ భాగాలపై అనుమానం వ్యక్తం చేసిన కస్టమ్స్ అధికారులు…ఇంజన్ బాగాలను క్షుణ్ణంగా పరిశీలించారు. పరికరాల్లో దాచిన తెల్లటి పౌడర్ ను అధికారులు కనిపెట్టారు. దీంతో ఆ నిందితున్ని అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు.. మాదకద్రవ్యాలు ఎవరి కోసం తెచ్చారు అనే సమాచారాన్ని కూపి లాగుతున్నారు. దీని వెనుక వున్న అసలు సూత్రధారి పై లోతుగా విచారణ చేస్తోంది అధికారుల బృందం.

Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...

More Articles Like This