Tuesday, July 27, 2021

శ్రీశైలం జలాశయానికి పోటెత్తిన వరద…

Must Read

వర్షాలు బాగా రావడంతో శ్రీశైలం జలాశయానికి వరద పోటెత్తింది. వ్యవసాయానికి ఉపోయోగపడటంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలో 2009 లో ప్రాజెక్టు చరిత్రలోనే అత్యధికంగా 26 లక్షల క్యూసెక్కుల వరద జలాశయంలోకి ప్రవేశించింది. భారీ వరదనీటితో ప్రాజెక్టు సామర్థ్యం కంటే 10 అడుగులపై నుంచి నీరు ప్రవహించింది.

శ్రీశైలం జలాశయానికి ఇప్పుడు వరద నీరు కొనసాగుతుంది. ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా జలాశయంలో నీరు వచ్చి చేరుతుంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో ఇన్ ఫ్లో 36,207 క్యూసెకులు ఉండగా ఔట్ ఫ్లో మాత్రం 26,839 గా ఉంది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885.00 అడుగులు కాగా ప్రస్తుతం 822.70 అడుగులుగా ఉంది. పూర్తిస్దాయి నీటి నిల్వ 215.8070 టిఎంసీలు కాగా ప్రస్తుతం 42.8708 టీఎంసీలు ఉంది. అయితే ప్రస్తుతం ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రం లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. కానీ కుడి గట్టు విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి మాత్రం ప్రారంభం కాలేదు.

Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...

More Articles Like This