Friday, July 30, 2021

వామ్మో ఇదేంటి.. చేప కడుపులో పుల్ విస్కీబాటిల్

Must Read

ప్ర‌పంచం వ్యాప్తంగా ఎంతో మంది స‌ముద్రంపై ఆధార‌ప‌డి జీవ‌నం సాగిస్తుంటారు. స‌ముద్రంలో దొరికే చేప‌ల‌ను ప‌ట్టుకొని వాటిని అమ్ముతూ బ్రతుకుతారు. అయితే, ప్ర‌తిరోజూ స‌ముద్రంలో అద్భుతాలు జ‌రుగుతాయ‌ని అనుకోకూడ‌దు. ఒక్కోసారి అదృష్టం అలా క‌లిసి వ‌స్తుంది.

నిత్యం స‌ముద్రంలో చేప‌లు ప‌ట్టుకొని జీవించే ఓ మ‌త్స్య‌కారుడి వ‌ల‌కు ఓ పెద్ద చేప దొరికింది. ఆ చేప‌ను ప‌డ‌వ‌లోని బ‌ల్ల‌పై ఉంచి క‌త్తిలో కోశాడు. చేప క‌డుపులో చేయిపెట్టి శుభ్రం చేస్తుండ‌గా అత‌డికి ఓ బాటిల్ దొరికింది. దాన్ని చూసి మ‌త్స్య‌కారుడు ఆశ్చర్యపోయాడు.

ఫుల్ విస్కి బాటిల్ కావ‌డంతో ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి. దీనికి సంబందించిన వీడియోను టిక్‌టాక్ యూజ‌ర్ బెనిబాన్ షేర్ చేయ‌డంతో ఈ వీడియో వైర‌ల్‌గా మారింది. ఆరు మిలియ‌న్ల‌కు పైగా వ్యూస్ తో నెట్లో హల్చల్ చేస్తుంది.

Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...

More Articles Like This