Saturday, June 19, 2021

పొలంలో బంగారు బయటపడ్డ బంగారం.. ఊరి జనం ఏం చేసారంటే?

Must Read

ఒక రైతు పొలంలో బంగారు మల్లన్న విగ్రహం దొరకడం ములుగు జిల్లాలో సంచలనం రేపుతుంది. ములుగు జిల్లా ముప్పనపల్లి గ్రామంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బిల్ల నారాయణ అనే రైతు కుటుంబసభ్యులు, అదే మండలంలోని బుట్టాయిగూడెం గ్రామానికి చెందిన మరో వ్యక్తితో కలిసి తన పొలంలో మే 26న గుప్త నిధుల కోసం తవ్వకాలు చేసారు

తవ్వకాలు జరిపినచోట ఏదో జంతువును కూడా బలి ఇచ్చినట్లు ఆధారాలు ఉన్నాయని పోలీసులు గుర్తించారు. ఈ తవ్వకాల్లో సుమారు 500 గ్రాముల బరువు ఉన్న బంగారు మల్లన్న దేవుని విగ్రహం బయటపడింది. ఈ విషయం శుక్రవారం గ్రామస్థులకు తెలియడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. విచారణ నిమిత్తం బిల్ల నారాయణ ఇంటికి వెళ్లిన ఆఫీసర్లు పూజ గదిలోని దేవుడి ఫోటోల వద్ద మల్లన్న దేవుని విగ్రహం కూడా పెట్టి పూజలు చేస్తున్నట్లు గమనించారు.

ఆ వెంటనే నారాయణను పోలీసులు విచారించగా తమ తాతముత్తాల నుంచి మల్లన్న దేవున్ని కుల దైవంగా కోలుస్తున్నామని ఓ రోజు కలలో కనపడి పొలంలో తన విగ్రహం ఉందని, తవ్వి తీయాలని చెప్పడంతో తీసినట్లు పేర్కొన్నారు. మల్లన్నతోపాటు మరిన్ని విగ్రహాలు తవ్వకాల్లో దొరికినట్లు గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శనివారం మరింత విచారణ జరిపి పూర్తి వివరాలను సేకరిస్తామని అంత వరకు ఆ విగ్రహాన్ని నారాయణ ఇంటిలోనే పెట్టామని తహసీల్దార్​ ఆదేశించారు.

Latest News

వ్యాక్సిన్ తీసుకున్నాక ఆ పని చేయ‌వ‌చ్చా?

క‌రోనా కేసులు క్ర‌మంగా తగ్గుముఖం ప‌డుతున్నాయి. వ్యాక్సినేష‌న్‌ను వేగవంతం చేయ‌డంతో క్ర‌మంగా కేసులు తగ్గుతున్నాయి. అయితే, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక వ్యాయామం చేస్తే ఏమౌతుంది అనే...

More Articles Like This