Friday, July 30, 2021

బంగారం ధరలు పెరిగాయి.. వెండి ధరలు నిలకడగా ఉన్నాయి..

Must Read

బంగారం ధరలు స్వల్పంగా పెరుగుదల. బంగారం ధరల్లో ప్రతి రోజు మార్పులు జరుగుతూనే ఉంటాయి. అందుకే బంగారం కొనుగోలు చేసే వారంతా ఆసక్తితో బులియన్ మార్కెట్ వైపు దృష్టి పెడుతుంటారు. అయితే తాజాగా సోమవరాం దేశీయంగా 10 గ్రాముల బంగారంపై స్వల్పంగా పెరిగింది. ఒక రోజు ధరలు తగ్గితే.. మరొక రోజు పెరుగుతుంటాయి.

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,110 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,110 ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,110 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,110 ఉంది

ఇక దేశీయంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,260 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,310 ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,460 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,500 ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,160 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,160 ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,670 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,220 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,110 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,110 ఉంది. ఇక కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,110 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,110 ఉంది.

వెండి ధరలు
దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.67,900 ఉండగా, చెన్నైలో రూ.73,400 ఉంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కిలో వెండి ధర రూ.67,900 ఉండగా, కోల్‌కతాలో రూ.67,900 ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.67,900 ఉండగా, కేరళలో రూ.67,900 ఉంది. ఇక హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.73,400 ఉండగా, విజయవాడలో రూ.73,400 వద్ద కొనసాగుతోంది.

 బంగారం ధరలు పెరగడానికి ఎన్నో కారణాలున్నాయంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని వెల్లడిస్తున్నారు. బంగారం కొనుగోలు చేసే వారు ఆ సమయంలో ధర ఎంత ఉందో తెలుసుకొని వెళ్లడం మంచిది.
Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...

More Articles Like This