Saturday, June 19, 2021

ఇక పై ఇంటికే మద్యం డోర్ డెలివరీ.. ప్రభుత్వం నిర్ణయం

Must Read

ఆన్లైన్ లో మొబైల్ యాప్ లేదా వెబ్ పోర్టల్ ద్వారా మద్యం డోర్ డెలివరీ చేసేందుకు సన్నాహాలు మొదలు పెట్టింది ఇచ్చింది ఢిల్లీ ప్రభుత్వం. దేశీయ మద్యం, విదేశీ మద్యం ఏదైనా హోమ్ డెలివరీ చెయ్యడానికి అనుమతించింది గవర్నమెంట్. మద్యం వ్యాపారాన్ని నియంత్రించే కొత్త ఎక్సైజ్ చట్టంలో మార్పులు చేసి, ఈమేరకు కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ ఎక్సైజ్ నిబంధనల ప్రకారం, ఎల్ -13 లైసెన్స్ హోల్డర్లు ప్రజల ఇళ్లకు మద్యం పంపిణీ చేయడానికి అనుమతి ఇచ్చింది.

ఢిల్లీ అబ్కారీ శాఖ ప్ర‌క‌ట‌న ప్ర‌కారం.. ఫారం ఎల్ -13 లైసెన్స్ ఉన్నవారు మొబైల్ యాప్ లేదా ఆన్‌లైన్ వెబ్ పోర్టల్ ద్వారా ఆర్డర్ చేసినవారికి భారతీయ మద్యం మరియు విదేశీ మద్యం డోర్ డెలివరీ చేయవచ్చు. కానీ క‌చ్చితంగా ఆర్డ‌ర్ మాత్రం మొబైల్ యాప్ లేదా ఆన్‌లైన్ వెబ్ పోర్ట‌ల్ ద్వారా జ‌ర‌గాలి. అయితే హాస్ట‌ళ్లు, ఆఫీసులు, కార్యాలయాలకు మాత్రం మ‌ద్యం హోండెలివ‌రీ చేయరాదని నిబంధనలు పెట్టారు.

క‌రోనా వ్యాప్తి తగ్గించడం కోసం ఢిల్లీలో లాక్‌డౌన్ ఆంక్ష‌ల‌ను అమ‌లు చేస్తుండగా.. ఈ క్రమంలోనే ఎక్సైజ్ చ‌ట్టాల‌లో సవరణ చేశారు. అయితే ఈ నిర్ణయంతో నగరంలోని మద్యం దుకాణాలకు మద్యం హోమ్ డెలివరీ చేయొచ్చు అనే అధికారం ఇచ్చినట్లుగా కాదని త్వరలోనే దీనికి సంబంధించి పూర్తి విధివిధానాలతో తెలియజేస్తామని తెలిపారు.

Latest News

వ్యాక్సిన్ తీసుకున్నాక ఆ పని చేయ‌వ‌చ్చా?

క‌రోనా కేసులు క్ర‌మంగా తగ్గుముఖం ప‌డుతున్నాయి. వ్యాక్సినేష‌న్‌ను వేగవంతం చేయ‌డంతో క్ర‌మంగా కేసులు తగ్గుతున్నాయి. అయితే, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక వ్యాయామం చేస్తే ఏమౌతుంది అనే...

More Articles Like This