Saturday, June 19, 2021

తెలుగు రాష్ట్ర ప్రజలకు అలెర్ట్: రానున్న 3 రోజుల్లో భారీ వర్షాలు

Must Read

ైరుతి రుతుపవనాలు దేశంలోని మరికొన్ని రాష్ట్రాల్లో ప్రవేశించాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. కేరళలోని మిగిలిన అన్ని ప్రాంతాలతో పాటు.. లక్షద్వీప్, దక్షిణ కర్ణాటక, ఉత్తర కర్ణాటకలోని పలు ప్రాంతాలు, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో రుతుపవనాలు ప్రవేశించాయని ఐఎండీ ప్రకటించిది.

రానున్న 2-3 రోజుల్లో నైరుతి రుతుపవనాలు మహారాష్ట్ర , గోవా రాష్ట్రాలతో పాటు ఈశాన్య బంగాళాఖాతము మరియు ఈశాన్య భారతదేశంల లోని కొన్ని ప్రాంతాలలో .. దక్షిణ అరేబియా సముద్రం, కర్ణాటక, తమిళనాడుల లోని మిగిలిన అన్ని ప్రాంతాలలో ఆంధ్ర ప్రదేశ్ లలోని మరికొన్ని ప్రాంతాలలోనికి విస్తరించే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు వెల్లడించారు. అయితే రేపటికి ఏపీలోని రాయలసీమ వ్యాప్తంగా రుతుపవనాలు విస్తరిస్తాయని పేర్కొంది.

రాగాల మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ లోని ఉత్తర కోస్తా ఆంధ్ర , యానాం, దక్షిణ కోస్తా ఆంధ్రా, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. రేపు ఎల్లుండి కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.

Latest News

వ్యాక్సిన్ తీసుకున్నాక ఆ పని చేయ‌వ‌చ్చా?

క‌రోనా కేసులు క్ర‌మంగా తగ్గుముఖం ప‌డుతున్నాయి. వ్యాక్సినేష‌న్‌ను వేగవంతం చేయ‌డంతో క్ర‌మంగా కేసులు తగ్గుతున్నాయి. అయితే, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక వ్యాయామం చేస్తే ఏమౌతుంది అనే...

More Articles Like This