Saturday, June 19, 2021

ఆనందయ్య మందు తీసుకున్న జగపతి బాబుకి ఏమైందంటే?

Must Read

కృష్ణపట్నంకు చెందిన ఆనందయ్య కరోనా మందు దేశవ్యాప్తంగా సంచలబ్నం సృష్టించింది. ఒక సామాన్య వ్యక్తి గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది అంటే ఖచ్చితంగా అది ఆయుర్వేదం గొప్పతనం అని చెప్పక తప్పదు. అయితే ఈ విషయంలో ప్రభుత్వం ఎంటర్ కావడంతో కొన్ని రోజుల పాటు ఆనందయ్య మందు పంపిణీ నిలిచిపోయింది. ఇక నిన్ననే ఈ తయారీ ప్రక్రియ ప్రారంభం కాగా మూడు రోజుల పాటు అది కొనసాగనుంది. ఆయుర్వేదంతో సంపూర్ణ ఆరోగ్యం ఉంటుందని జగపతిబాబు అన్నారు. భారతీయ వైద్యవిధానంలో ఆయుర్వేదానికి చెక్కుచెరగని స్థానం ఉందని తెలిపారు. అయితే ఈ మందు డోస్ తీసుకున్నానని ఆ తర్వాత తన శరీరంలో జరిగిన మార్పుల గురించి జగపతి బాబు తాజాగా వెల్లడించారు.

హైదరాబాద్ జూబ్లీహిల్స్​లో ఏర్పాటు చేసిన ఆయుర్వేదిక్ ఆస్పత్రిని ప్రారంభించారు. అనంతరం మీడియాతో జగపతిబాబు మాట్లాడారు. ఈ సందర్భంగా తాను ఆనందయ్య మందు తీసుకున్నానని ఒక డోస్ తీసుకున్నాక తన శరీరంలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాలేదని చెప్పారు. అలాగే దేవుడి దయ వల్ల కరోనా కూడా ఇప్పటివరకు తనకు రాలేదని అన్నారు. చాలా వీడియోలు చూసి తాను ఒక విశ్లేషణ చేసి ఆ తర్వాత ఆనందయ్య మందు వేసుకున్నానని అది వేసుకున్నందుకు ఆనందంగా ఉన్నాను అని ఆయన చెప్పుకొచ్చారు.

వెయ్యేళ్ల క్రితమే భారతీయ బుుషులు యోగా, ప్రాణాయమంతో కలిగే ప్రయోజనాలు గుర్తించారని సినీ నటుడు జగపతిబాబు అన్నారు. అత్యవసరమైతేనే అల్లోపతి వైద్య విధానాన్ని అనుసరించాలని సూచించారు. ప్రకృతి సిద్ధంగా వ్యాధులను నయం చేసే ఆయుర్వేద వైద్యంతో ఆరోగ్యం సొంతమవుతుందని చెప్పారు.రోగాలను నయం చేయడంలో భారతీయ వైద్య విధానంలో ఆయుర్వేదం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు.

Latest News

వ్యాక్సిన్ తీసుకున్నాక ఆ పని చేయ‌వ‌చ్చా?

క‌రోనా కేసులు క్ర‌మంగా తగ్గుముఖం ప‌డుతున్నాయి. వ్యాక్సినేష‌న్‌ను వేగవంతం చేయ‌డంతో క్ర‌మంగా కేసులు తగ్గుతున్నాయి. అయితే, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక వ్యాయామం చేస్తే ఏమౌతుంది అనే...

More Articles Like This