Tuesday, July 27, 2021

దేశంలో ఈ రోజు కరోనా కేసులు ఎన్ని అంటే?

Must Read

మన దేశంలో క‌రోనా కేసులు క్రమంగా త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. అయినప్పటికీ ప్రజలు జాగ్రత్తలు పాటించవలసిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం తాజాగా క‌రోనా బులిటెన్‌ను విడుద‌ల చేసింది. ఈ బులిటెన్ ప్రకారం, గ‌డిచిన 24 గంట‌ల్లో ఇండియాలో 43,733 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వ‌ర‌కు న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 3,06,63,665 కి చేరింది.

ఇందులో 2,97,99,534 మంది కోలుకొని డిశ్చార్జ్‌కాగా, 4,59,920 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక‌, గ‌డిచిన 24 గంట‌ల్లో ఇండియాలో క‌రోనాతో 930 మంది మృతి చెందారు. దేశంలో ఇప్పటి వ‌ర‌కు మొత్తం 4,04,211 మంది క‌రోనాతో మృతి చెందారు. ఒక్క రోజులో దేశంలో 47,240 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇక ఇప్పటి వ‌ర‌కు దేశంలో 36,13,23,548 మందికి వ్యాక్సిన్ అందించారు.

Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...

More Articles Like This