Friday, July 30, 2021

ఇండియా క‌రోనా పాజిటీవ్ కేసులు న‌ల‌భైవేల కంటే తక్కువ

Must Read

ఇండియాలో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 3,03,16,897కి చేరింది. ఇందులో 2,93,66,601 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 5,52,659 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇండియాలో క‌రోనా కేసులు త‌గ్గుముఖం పడుతున్నాయి. రోజువారీ కేసులు భారీ స్థాయిలో త‌గ్గుతుండ‌టం విశేషం. చాలా రోజుల త‌రువాత న‌ల‌భైవేల‌కు దిగువున పాజిటీవ్ కేసులు న‌మోద‌య్యాయి.

 తాజాగా కేంద్రం క‌రోనా బులిటెన్‌ను రిలీజ్ చేసింది.  ఈ బులిటెన్ ప్ర‌కారం దేశంలో కొత్త‌గా 37,566 కేసులు న‌మోద‌య్యాయి. గడిచిన 24 గంట‌ల్లో ఇండియాలో క‌రోనాతో 907 మంది మృతి చెందారు.  దీంతో దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనాతో 3,97,637 మంది మృతిచెందారు.  ఇక‌, గ‌డిచిన 24 గంట‌ల్లో 56,994 మంది కోలుకొని డిశ్చార్జ్ కావ‌డం విశేషం. 
Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...

More Articles Like This