Friday, July 30, 2021

ఆంధ్రప్రదేశ్లో ఐపీఎస్ బదిలీలు… దిశ డీఐజీగా బి. రాజకుమారికి పదోన్నతి

Must Read

ఆంధ్రప్రదేశ్ లో ఐపీఎస్ అధికారుల బదిలీలకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలో భారీగా ఐపీఎస్ బదిలీలు అయ్యారు. విజయనగరం, నెల్లూరు, తూ.గో, కృష్ణా జిల్లాల ఎస్పీల బదిలీలు అయ్యారు. పదోన్నతిపై దిశ డీఐజీగా బి. రాజకుమారి నియామకం అయ్యారు. విజయనగరం జిల్లా ఎస్పీగా ఎం.దీపిక బదిలీ అయ్యారు. అలాగే నెల్లూరు జిల్లా ఎస్పీగా సీహెచ్. విజయారావు నియామకం అయ్యారు. తూ.గో. జిల్లా ఎస్పీగా రవీంద్రనాథ్‌ బాబు నియామకం అయ్యారు. కృష్ణా జిల్లా ఎస్పీగా సిద్దార్థ కౌశల్ బదిలీ కాగా… గ్రేహౌండ్స్ గ్రూప్ కమాండరుగా అద్నాన్ నయీమ్ అస్మి నియామకం అయ్యారు.

గుంటూరు రూరల్ ఏఎస్పీ అడ్మినుగా రిషంత్‌రెడ్డి నియామకం కాగా… సెబ్ ఏఎస్పీలుగా ఎస్. సతీష్‌ కుమార్, విద్యా సాగర్‌ నాయుడు బదిలీ అయ్యారు. సెబ్ అసిస్టెంట్ ఎస్పీలుగా బిందుమాధవ్, తుహిన్‌ సిన్హా లు బదిలీ అయ్యారు. అలాగే.. పాడేరు అసిస్టెంట్ ఎస్పీగా పి.జగదీష్ బదిలీ కాగా…. నర్సీపట్నం అసిస్టెంట్ ఎస్పీగా వీ.ఎన్.మణికంఠ చంధోలు బదిలీ చేసినట్టు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రంపచోడవరం అసిస్టెంట్ ఎస్పీగా కృష్ణ కాంత్ పటేల్ బదిలీ అయ్యారు. చింతపల్లి అసిస్టెంట్ ఎస్పీగా తుషార్ డూడి బదిలీ అయ్యారు. ఈ బదిలీల్లో ఐపీఎస్ అమ్మిరెడ్డి పోస్టింగ్‌ దక్కించుకోలేకపోయారు.

Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...

More Articles Like This