Tuesday, July 27, 2021

జబర్దస్త్ టీమ్ లీడర్ ఆరోగ్యం విషమం

Must Read

జబర్దస్త్ కామెడీ షోలో చాలా మంది కమెడియన్లు సత్తా చూపిస్తున్నారు. కేవలం ఆ షో నుంచే పాపులర్ అయిన వాళ్లు చాలా మందే ఉన్నారు. బుల్లితెరపై తమ సత్తా చూపించి కొందరు సినిమాలు కూడా చేస్తున్నారు. జబర్దస్త్ కామెడీ షో నుంచి హీరోలుగా మారిన వాళ్లు కూడా లేకపోలేదు. బయట ఎంత బిజీగా ఉన్నా తమకు లైఫ్ ఇచ్చిన జబర్దస్త్ కామెడీ షోను మాత్రం వదలట్లేదు కమెడియన్స్. అయితే సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్న ఈషోలో కొన్ని రోజులుగా టీమ్ లీడర్ జిగేల్ జీవన్ కనిపించకపోవడంతో జబర్దస్త్ ప్రోగ్రాం ఫాలోవర్స్ మరియు అతని అభిమానులు నిరాశ చెందారు.

అయితే ఈ మధ్యనే అలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్న జబర్దస్త్ నటులు ఆటో రాంప్రసాద్, అదిరే అభి ఓ సందర్భంలో జిగేల్ జీవన్ జబర్దస్త్ షోకు దూరం కావడానికి గల కారణాలను చెప్పారు. టీమ్ లీడర్ జీవన్ ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో ICUలో ఉన్నాడని, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న జీవన్ చావు బతుకుల మధ్య పోరాటం చేస్తూ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాడని ఆటో రాంప్రసాద్ తెలియజేస్తూ ఎమోషనల్ అయి కంటతడి పెట్టాడు పెట్టాడు.

జబర్దస్త్ టీమ్ లీడర్ జీవన్ కు ఈ పరిస్థితి రావడానికి గల కారణాలేంటో స్పష్టంగా తెలియలేదు.జీవన్ అనారోగ్యంతో ఆస్పత్రి పాలయ్యాడని తెలియగానే జబర్దస్త్ టీమ్ లీడర్స్, అభిమానులు ఎంతో ఆందోళన చెందారు. జీవన్ త్వరగా కోలుకోవాలని మనసారా కోరుకుంటూ దేవుని ప్రార్థిస్తున్నారు. అలాగే తమ అభిమాన కమెడియన్ క్షేమంగా తిరిగొస్తాడని,మళ్లీ జబర్దస్త్ వేదికపై నవ్వుల వర్షం కురిపించాలని ప్రార్దిస్తున్నారు.

Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...

More Articles Like This