Friday, July 30, 2021

జేఎన్‌టీయూహెచ్ పరీక్షలు: జులైలో బీటెక్‌, బీఫార్మసీ పరీక్షలు.. షెడ్యూల్‌ విడుదల

Must Read

హైదరాబాద్ జేఎన్‌టీయూ షెడ్యూల్‌ను విడుదల చేసింది. బీటెక్, బీఫార్మసీ థర్డ్, ఫైనల్ ఇయర్ మొదటి సెమిస్టర్ పరీక్షలను జులై 1 నుంచి 3 వ తేదీల్లో నిర్వహించనున్నారు. వాస్తవానికి ఈ పరీక్షలు మార్చి 25 నుంచి 27 మధ్య జరగాల్సి ఉంది. ఇక బీటెక్, బీఫార్మసీ ఫైనల్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ పరీక్షలను జులై 5వ తేదీ నుంచి 14వ తేదీ వరకు నిర్వహించనున్నారు.

బీటెక్, బీఫార్మసీ థర్డ్, ఫైనల్ ఇయర్ పరీక్షలు జులై నెలలో నిర్వహించనున్నారు. అయితే కరోనా వ్యాప్తి నేపథ్యంలో పరీక్షలను వాయిదా వేస్తూ జేఎన్టీయూ నిర్ణయించింది. ఇప్పుడు కరోనా తగ్గుముఖం పట్టడంతో పరీక్షలను మళ్లీ నిర్వహించాలని డిసైడ్ అయ్యింది. ఈ క్రమంలోనే తాజాగా షెడ్యూల్ విడుదల చేసింది.

పరీక్షల షెడ్యూల్‌కు సంబంధించి పూర్తి వివరాలు కోసం అధికారిక వెబ్‌సైట్‌‌లో పొందుపరచడం జరిగిందని, విద్యార్థులు పరీక్షల షెడ్యూల్‌ను వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చునని యూనివర్సిటీ అధికారులు తెలిపారు. ఇదిలాఉంటే.. జేఎన్టీయూ అకాడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్‌గా డి. శ్రీనివాసరావు నియామకం అయ్యారు.

Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...

More Articles Like This