Tuesday, July 27, 2021

చనిపోయిన యువకుడి గుండెను తిరిగి కొట్టుకునేలా చేసిన కరీంనగర్ కానిస్టేబుల్

Must Read

కరీంనగర్ నగరంలో ఓ కానిస్టేబుల్ చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆయన సరైన సమయానికి చాకచక్యంగా వ్యవహరించి ఓ వ్యక్తి ప్రాణాలను నిలబెట్టాడు. బైక్ ఢీకొనడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన యువకుడిని అంబులెన్స్‌ వచ్చే వరకు ఉండకుండా తనకు తెలిసిన ప్రాథమిక వైద్యం తో ప్రాణాలు కాపాడి కానిస్టేబుల్ మానవత్వాన్ని చాటారు. దీంతో యువకుడు బతికాడు. ఆగిన గుండెకు ప్రాణం పోశారని స్థానికులు, కానిస్టేబుల్‌ను ప్రశంసిస్తున్నారు.

కరీంనగర్‌ సిటీ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్‌ పని చేస్తున్న ఖలీల్‌ ఏంటో చేకఛేక్యంగా వ్యవహరించి యువకుడి ప్రాణాలు కాపాడాడు. కరీంనగర్‌ పట్టణం హౌసింగ్‌ బోర్డు కాలనీలో బైక్ ఢీకొని అబ్దుల్‌ ఖాన్‌ అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో యువకుడు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు . అది చుసిన అక్కడే విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌ ఖలీల్‌ యువకుడికి సీపీఆర్‌ నిర్వహించి గుండెపై ఒత్తిడి పెంచి గుండె పనిచేసేలా చేశారు. యువకుడి గుండె కొట్టుకోవడం ప్రారంభించాక వెంటనే అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు.

కానిస్టేబుల్‌ ఖలీల్‌ చేసిన ప్రయత్నాన్ని వైద్యులు తెలుసుకొని అభినందించారు. ఖలీల్‌ ఎంతో సమయస్ఫూర్తితో వేగంగా స్పందించారని అన్నారు. ప్రస్తుతం ఆ యువకుడు స్థానిక ఓ ఆస్పత్రిలో కోలుకుంటున్నాడు . కానిస్టేబుల్‌ చేసిన పనిని తెలుసుకొని కరీంనగర్‌ సీపీ కమలాసన్‌ రెడ్డి అభినందించారు. కానిస్టేబుల్ పేరును లైఫ్‌ సేవింగ్‌ అవార్డుకు సిఫార్సు చేశారు. డీజీపీ మహేందర్‌రెడ్డి సైతం కానిస్టేబుల్‌ ఖలీల్‌ సరైన సమయంలో వ్యక్తి ప్రాణాలు కాపాడినందుకు ప్రశంచించారు .

Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...

More Articles Like This