Saturday, June 19, 2021

అక్కాచెల్లెళ్లను పెళ్లి చేసుకున్న పెళ్లి కొడుకు అరెస్ట్..!

Must Read

కర్ణాటకలోని కోలార్​లో ఇద్దరు అక్కాచెల్లెళ్లిద్దరినీ ఒకే మండపంపై పెళ్లి చేసుకొని వార్తల్లోకెక్కిన వరుడిని పోలీసులు అరెస్ట్​ చేశారు. ఈ ఘటనలో వరుడు ఉమాపతితో సహా.. మరో ఏడుగురిపై కేసు నమోదు చేశారు. 31 ఏండ్ల ఉమాపతి.. మూగ, వినికిడి సమస్యలతో బాధపడుతున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లను (సుప్రియ, లలిత) పెళ్లి చేసుకున్నాడు.

తన కూతుళ్లకు వేరు వేరుగా పెళ్లి చేస్తే.. ఆర్ధిక ఇబ్బందులు వస్తాయి తన వల్ల కాదని భావించిన తండ్రి.. వయసు గురించి ఆలోచించకుండా ఇద్దరు అక్కాచెల్లెళ్ళను ఒకే వరుడినిచ్చి కట్టబెట్టాడు. కాగా ఈ విష‌యం సోషల్ మీడియాలో వైర‌ల్ కావ‌డంతో పోలీసుల దృష్టికి చేరింది. సుప్రియ సోద‌రి వ‌య‌సు 16 ఏండ్లు కావ‌డంతో..

పెళ్లి చేసుకున్న యువ‌కుడితో పాటు అత‌ని కుటుంబ స‌భ్యుల‌పై పోలీసులు కేసు న‌మోదు చేశారు. నూత‌న వ‌రుడు ఉమాప‌తిని పోలీసులు అరెస్టు చెయ్యడంతో అందరూ ఒక్కసారిగా షాకయ్యారు.

Latest News

వ్యాక్సిన్ తీసుకున్నాక ఆ పని చేయ‌వ‌చ్చా?

క‌రోనా కేసులు క్ర‌మంగా తగ్గుముఖం ప‌డుతున్నాయి. వ్యాక్సినేష‌న్‌ను వేగవంతం చేయ‌డంతో క్ర‌మంగా కేసులు తగ్గుతున్నాయి. అయితే, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక వ్యాయామం చేస్తే ఏమౌతుంది అనే...

More Articles Like This