Tuesday, July 27, 2021

వర్షాలతో కృష్ణమ్మ పరుగులు.. జూరాల ప్రాజెక్టుకు మళ్లీ ప్రవాహం

Must Read

ఎగువ నుంచి వరద రానుండటంతో అధికారులు జూరాల జలవిద్యుత్తు కేంద్రంలో ఒక యూనిట్‌లో ఉత్పత్తి ప్రారంభించారు.పై నుంచి వరద ప్రవాహం మొదలైన క్రమంలో జూరాలకి నీరు చేరుతుంది.

కృష్ణా నది ఎగువన, పరీవాహక ప్రాంతాల్లో వర్షాలు, ప్రవాహాల కారణంగా జూరాలకు మళ్లీ ప్రవాహం మొదలైంది. జూన్‌లో ఇప్పటివరకు ఆలమట్టికి సుమారు 70 టీఎంసీల నీరు చేరగా.. బుధవారం ఉదయం లక్షా 17 వేల క్యూసెక్కుల వరద కొనసాగుతోంది. దీంతో గేట్లను కొంతమేర ఎత్తి నీటిని దిగువకు విడిచిపెడుతున్నారు. నారాయణపూర్‌ ఆనకట్టకు 40 వేల క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా, దిగువకు 43 వేల క్యూసెక్కులు వదులున్నారు. ఈ రెండు రిజర్వాయర్లు నిండటానికి మరో 53 టీఎంసీలు మాత్రమే అవసరం.

కర్ణాటక ప్రభుత్వం రాబోయే రోజుల్లో వచ్చే వరదను పరిగణనలోకి తీసుకొని ముందుగానే దిగువకు నీటి విడుదలను ప్రారంభించింది. జూరాలకు బుధవారం సుమారు రెండువేల క్యూసెక్కులు మాత్రమే వస్తుండగా, గురువారం నాటికి స్వల్పంగా పెరిగింది. మరోవైపు తుంగభద్రకు 32,343 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా.. పూర్తిస్థాయిలో నిండటానికి మరో 75 టీఎంసీలు అవసరం.

నదికి రెండు వైపులా రైతులు మోటార్లు వేసుకుని సాగునీటిని తరలించి పంటలు సాగు చేస్తుంటారు. ఈ క్రమంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల పరిధిలో నదీ పరీవాహక ప్రాంతం మాగనూరు వద్ద తంగడిగి నుంచి మొదలై అలంపూర్‌ గొందిమళ్ల వరకు ఉంటుంది.

Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...

More Articles Like This