Saturday, June 19, 2021

బిగ్ బ్రేకింగ్: సోను సూద్ అరెస్ట్..! ఏం జరిగిందంటే?

Must Read

దేశవ్యాప్తంగా ఉన్న కరోనా కష్టకాలంలో ఆపదలో ఉన్న వారికి సహాయం చేస్తూ ఎంతోమంది అభిమానాన్ని పొందుతున్న సోను సూద్ కి ముంబై హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈమధ్య కాలంలో సోనుసూద్ తో సహా చాలా మంది సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు ఆపదలో అవసరం ఉన్నవారికి యాంటీ కోవిడ్ డ్రగ్ అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇదే ఈ విషయంపై మరియు
సోను సూద్ చేస్తున్న సేవా కార్యక్రమాలపై జస్టిస్ అమ్జాద్ సయీద్, గిరీష్ కులకర్ణిలతో కూడిన ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది.

కోవిడ్ యాంటీ డ్రగ్స్ పై సర్వ అధికారాలు కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే
ఉంటుంది. అలాంటి సమయంలో సెలబ్రిటీలకు, రాజకీయ నాయకులకు ఈ యాంటీ డ్రగ్స్ ఎక్కడినుంచి లభిస్తుంది ఎవరు వీళ్ళకు అందిస్తున్నట్టు అంటూ ముంబై హైకోర్టు ప్రశ్నించింది. ఇలాంటి కష్ట కాలంలో ప్రజల క్షేమం కోసం ఈ విధంగా మంచి ఆలోచన చేయడం చాలా మంచి దేనని, అయితే ఇంత పెద్ద మొత్తంలో వీరికి ఇంజెక్షన్లు ఎక్కడినుంచి లభ్యమవుతున్నాయనీ ధర్మాసనం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

ఈ యాంటీ డ్రగ్స్ ఈ విషయంలో వీరు అధికారికంగానే మందులను సమకూరుస్తున్నారా లేదా డ్రగ్స్ విషయంలో ఏదైనా బ్లాక్ మార్కెటింగ్ కుంభకోణం ఉందనే విషయంపై పూర్తి విచారణ జరపాలని హైకోర్టు ఆదేశించింది. రెమిడిసివర్‌ సహా మరికొన్ని కంపెనీలు కేవలం కేంద్ర ప్రభుత్వానికే మందులు చేస్తున్నాయని, సెలబ్రిటీలకు మందులు సరఫరా చేయడం లేదని తెలుపగా మరి సెలబ్రిటీలకు మందులు ఎక్కడినుంచి వస్తున్నాయని కోర్టు ప్రశ్నించింది. ఈ క్రమంలోనే కోర్టు ఆదేశాల మేరకు నటుడు సోనూసూద్‌ సహా, ముంబై కాంగ్రెస్ ఎమ్మెల్యే జీషన్ సిద్దిఖీ, ఇతర సెలబ్రిటీలకు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. దీనిపై వివరణ ఇవ్వాలని లేదంటే అరెస్ట్ తప్పదని ధర్మాసనం వీరినిహెచ్చరించింది.

Latest News

వ్యాక్సిన్ తీసుకున్నాక ఆ పని చేయ‌వ‌చ్చా?

క‌రోనా కేసులు క్ర‌మంగా తగ్గుముఖం ప‌డుతున్నాయి. వ్యాక్సినేష‌న్‌ను వేగవంతం చేయ‌డంతో క్ర‌మంగా కేసులు తగ్గుతున్నాయి. అయితే, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక వ్యాయామం చేస్తే ఏమౌతుంది అనే...

More Articles Like This