Friday, July 30, 2021

బిడ్డ పుట్టిన కొన్ని రోజులకే ఆత్మహత్య…అత్తింటి వేధింపులకు అల్లుడు బలి

Must Read

మహబూబాబాద్ జిల్లాలోని గార్ల పట్టణంలో బుధవారం భార్య, అత్తింటి వారి వేధింపులు తట్టుకోలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనం రేపింది.

 యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలంగాణలోని మహబూబాబాద్‌ జిల్లాలో విషాదం నింపింది. గార్లలోని వెంకటేశ్వరస్వామి దేవాలయం బజార్‌కు చెందిన బరిబద్దల రాకేష్‌(26)కు నెక్కొండ మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన స్నేహతో ఏడాది క్రితం వివాహం జరిగింది. 20 రోజుల క్రితమే వీరికి బాబు పుట్టాడు.

 అత్తామామలు మునీందర్, రేణుకతో పాటు ఇతర బంధువులు రాకేష్‌ను తరుచూ ఏ పనీ చేయకుండా జులాయిగా తిరుగుతున్నందుకు నిందించేవారు. ఏ పనీ చేయకుండా పెళ్లాన్ని, కొడుకుని ఎలా పోషిస్తావంటూ తరుచూ ఫోన్లు చేస్తూ మానసికంగా వేధించేవారు. బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో మనస్తాపానికి గురైన రాకేష్ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి రాజేశం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 
Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...

More Articles Like This