Tuesday, July 27, 2021

లక్కీ పెళ్ళికొడుకు: ఒకే మండపం లో ఇద్దరికి తాళి కట్టాడు..!

Must Read

ప్రస్తుతం ఉన్న రోజుల్లో ఒక్క పెళ్లితోనే ఒక్క భార్యతోనే వేగలేక చాలా మంది భర్తలు జీవితం సరిపోయిందిరా నాయనో అనుకుంటున్న సమయంలో ఓ యువకుడు తాను ప్రేమించిన ఇద్దరు అమ్మాయిలను ఒకే పెళ్లి మండపంలో పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకొని అందరికి షాకిచ్చాడు. విచిత్రం ఏంటంటే ఈ యువకుడు విద్యార్థులకు చదువు చెప్పాల్సిన టీచర్.

ఉట్నూర్‌ మండలం‌కు చెందిన అర్జున్‌ టీచర్‌ ట్రైనింగ్‌ పూర్తిచేసి ఇంటి వద్దే ఉంటున్నాడు.ఈ క్రమంలో తన మేనత్త కూతుళ్లను గత మూడేళ్లుగా ఒకరికి తెలియకుండా మరొకరితో ప్రేమాయణం నడిపించాడు. అయితే పెళ్లి చేసుకోవాలని ఆ యువతులు పట్టుపట్టడంతో అసలు విషయం పెద్దల దృష్టికి తీసుకువెళ్ళాడు.

ఇక ఆ పెళ్లికొడుకు కోరిక విన్న పెద్దలు ముందుగా ఆశ్చర్యపోయారు.మొత్తానికి అర్జున్‌ ప్రతిపాదన విన్న మూడు కుటుంబాలు గ్రామపెద్దలను ఆశ్రయించాయి. ఇక గ్రామ పెద్దలు కూడా ఇద్దరు యువతుల అభిప్రాయాలు తెలుసుకొని అంగీకరించారు. ఈ నెల 14న ఘనపూర్‌లో కుటుంబ సభ్యుల సమక్షంలో ఆదివాసీల సంప్రదాయం ప్రకారం అర్జున్‌, ఉషారాణి, సూర్యకళ పెళ్లి జరిపించారు.

Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...

More Articles Like This