Saturday, June 19, 2021

16 ఏళ్ళుగా భార్య శవం పక్కనే నిద్ర.. ఎందుకలా చేస్తున్నాడంటే?

Must Read

ప్రస్తుత కాలంలో చాలా మంది భార్యాభర్తలు ఈ బంధానికి విలువలు ఇవ్వడం లేదు. కానీ ఈ కాలంలో కూడా ఒక గొప్ప భర్త ఉన్నాడు పెళ్లంటే వందేళ్ళ పంట అంటారు. పెళ్ళితో ఒకటయ్యే ఆ జంట నిండు నూరేళ్లు ఒకరికి ఒకరు తోడుగా జీవించాలని కోరుకుంటారు. ఎన్ని కష్టాలు వచ్చినా ఒకరి చేయి ఒకరు వీడమని ప్రమాణం చేస్తారు. వీటిని ఖచ్చితంగా పాటించే వ్యక్తులు చాలా అరుదు.. అలాంటి ఓ భర్త గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. భార్య చనిపోయిన సరే ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆమెను విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేక ఆమె బాడీని తన పడక మీద పెట్టుకొని నిద్రిస్తున్నాడు ఈ భర్త. లీవ్ ఆన్ కు 1975లో వివాహం జరిగింది. అప్పటినుండి భార్య భర్తలు ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు ఇద్దరికీ చిన్న వయసులోనే పెళ్లి జరగడం వల్ల వారి మధ్య స్నేహం ఆ తర్వాత ప్రేమ, ఆ తర్వాత అన్యోన్యత ఏర్పడింది. వీరి ప్రేమకు ప్రతిఫలంగా ఏడుగురు పిల్లలు పుట్టారు ఇద్దరూ ఒకరిని విడిచి ఒకరు ఉండలేక పోయేవారు. అలా వారి బంధం మరింత బలపడింది. కానీ విధి వారి ప్రేమకు ఫుల్ స్టాప్ పెట్టింది.

సైన్యంలో పనిచేస్తున్న లి 2003 లో ఉద్యోగరీత్యా ఇంటికి దూరంగా విధులు నిర్వహించాడు ఈ సమయంలో అతడు ఒక విచారకర వార్త వినాల్సి వచ్చింది. తాను ఎంతగానో ప్రేమించేభార్య ఇక లేదని అకస్మాత్తుగా చనిపోయింది సమాచారం అతనికి అందింది. ఆమెను చూసేందుకు అతడూ హుటా హుటిన ఇంటికి బయల్దేరాడు లీ. కానీ ఎక్కువ సేపు ఆమె ముఖాన్ని చూడలేకపోయాడు ఆలస్యమైతే శవం పాడైతుందనే ఉద్దేశంతో స్మశానంలో పూడ్చి పెట్టాడు. భార్యను వీడలేక లి స్మశానం లో ఆమె సమాధి పక్కనే నిద్రించేవాడు. నెలల తరబడి అతడు స్మశానంలో గడిపాడు. ఒక రోజు వర్షం కురవడంతో ఆమె సమాధి దగ్గర నిద్ర పోలేకపోయాడు. దీంతో సమాధి పక్కనే స్వరంగం తవ్వి ఆమెకు దగ్గరగా పడుకున్నాడు.

చాలా రోజుల తర్వాత ఆమెను వదిలి ఉండలేకపోయాడు దానితో ఒక కీలక నిర్ణయం తీసుకున్నాడు. స్మశానం లో ఆమె సమాధిని తవ్వాడు అస్తికలను సంచులు వేసుకున్నాడు వాటిని ఇంటికి తీసుకువెళ్ళి తన పడక గదిలో పెట్టుకొని నిద్రపోయాడు ఆమె ఆస్తికలు కుళ్లిన స్థితిలో ఉండటంతో చూడలేక మదన పడ్డాడు దీంతో మరో కీలక నిర్ణయం తీసుకున్నాడు ప్లాస్టర్ అఫ్ పారిస్, సిమెంట్, జిగురు ఇసుకల మిశ్రమంతో లీ తన భార్య లాగా బొమ్మను తయారు చేశాడు. తన భార్య అస్తికలను అందులో ఉంచాడు అప్పటినుండి ఆ బొమ్మని తన భార్య గా భావిస్తూ బ్రతికేవాడు వాటి పక్కనే నిద్రపోయేవాడు.

ఈ విషయం తెలిసి అతని పిల్లలు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు . తమ తల్లి అస్తికలను స్మశానంలో ఉంచాలని లేకపోతే ఆమె ఆత్మకు శాంతి కలగదాని వాదించారు. కానీ లీ మనసు మార్చడంలో విఫలమయ్యారు. లీ తన భార్య అస్తికలను బొమ్మలు పెట్టుకొని నిద్రపోతున్నాడు అని దాని వల్ల వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని స్థానికులు పోలీసులకు చెప్పారు, దీంతో పోలీసులు అతనిని ఎలాగైనా ఒప్పించి ఆమె అస్తికలను తిరిగి స్మశానానికి చేర్చాలని ప్రయత్నించారు, కానీ లీ అందుకు ఒప్పుకోలేదు. అలా ఎన్ని ప్రయత్నాలు చేసిన లీ తన మొండితనం వీడలేదు దాంతో పోలీసులు వెనకడుగు వేశారు. లీ ఆ బొమ్మను రోజు శుభ్రంచేసి దుస్తులు మారుస్తాడు అందంగా మేకప్ చేసాడు. కొన్నాళ్ళు లీ నడవలేక వీల్ చైర్ కి పరిమితమయ్యాడు కానీ ఆ బొమ్మను మాత్రం వదలలేదు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ నా భార్య బ్రతికి ఉన్నప్పుడు ఆమెకు మంచి బట్టలు కొనలేక పోయాను, అందుకే తన కోసం కొత్త దుస్తులు తయారు చేశాను. నా భార్య శవాన్ని జాగ్రత్తగా చూసుకున్నందుకు జనాలంతా నన్ను వింతగా చూస్తున్నారు, కానీ ఆమె ఎప్పుడూ నాతోనే ఉంటుందని బలంగా నమ్ముతున్నాను నేను చనిపోయే వరకు ఆమె పక్కనే నిద్రిస్తాను అని మీడియాతో చెప్పారు.

Latest News

వ్యాక్సిన్ తీసుకున్నాక ఆ పని చేయ‌వ‌చ్చా?

క‌రోనా కేసులు క్ర‌మంగా తగ్గుముఖం ప‌డుతున్నాయి. వ్యాక్సినేష‌న్‌ను వేగవంతం చేయ‌డంతో క్ర‌మంగా కేసులు తగ్గుతున్నాయి. అయితే, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక వ్యాయామం చేస్తే ఏమౌతుంది అనే...

More Articles Like This