Friday, July 30, 2021

మ‌ళ్లీ పెరిగిన పెట్రోల్ ధ‌ర‌లు… బస్సులు ఎక్కుతున్న వాహ‌న‌దారులు

Must Read

పెట్రోల్ ధరలు రోజురోజుకి పెరగడంతో ప్రజలు ప్రత్యామ్నాయ దారులు వెతుకుంటున్నారు. దేశంలో పెట్రోల్ ధ‌ర‌లు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్ప‌టికే దేశంలో అనేక ప్రాంతాల్లో పెట్రోల్ ధ‌ర‌లు వంద రూపాయ‌లు దాటిపోయింది. తాజాగా, లీట‌ర్ పెట్రోల్‌పై 35 పైసులు పెరిగింది. పెరిగిన ధ‌ర‌ల ప్ర‌కారం వివిధ ప్రాంతాల్లో పెట్రోల‌ట్ డీజిల్ ధ‌ర‌లు ఇలా ఉన్నాయి.

హైద‌రాబాద్ః లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ.103.05, డీజిల్ ధ‌ర రూ.97.20
విజ‌య‌వాడః లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ.105.17, డీజిల్ ధ‌ర రూ.98.73.
గుంటూరుః లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ.105.37, డీజిల్ ధ‌ర రూ.98.93.

దేశ వ్యాప్తంగా చ‌మురు ధ‌ర‌లు పెరుగుతుండ‌టంతో వాహ‌న‌దారులు ఆందోళ‌నలు చేస్తున్నారు. ధ‌ర‌లు ఇలానే పెరిగితే ప్ర‌యాణాలు చేయ‌డం క‌ష్టంగా మారుతుంద‌ని, వాహ‌నాలు న‌డ‌ప‌లేమ‌ని అంటున్నారు. చ‌మురు ధ‌ర‌లు పెర‌గ‌డంతో సొంత వాహ‌నాల‌ను ప‌క్క‌న‌పెట్టి పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ల‌ను ఆశ్ర‌యిస్తున్నారు.

Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...

More Articles Like This