Wednesday, June 23, 2021

బిగ్ బ్రేకింగ్: కుప్పకూలిన అపార్ట్ మెంట్.. ఎంత మంది చనిపోయారంటే?

Must Read

భారీ వర్షాలతో అల్లాడుతున్న ముంబైలో ఘోర ప్రమాదం జరిగింది. నాలుగు అంతస్థలు భవనం కుప్పకూలి 9 మంది ప్రాణాలు కోల్పోయారు. బుధవార రాత్రి 11 గంటల సమంయలలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రమాదంలో ఇప్పటి వరకు 11 మంది మరణించారు. మరో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు.

భవనం కూలిన సమయంలో పిల్లలు కూడా ఉన్నారు. స్థానికులు, పోలీసుల సహాయంతో విపత్తు సిబ్బంది శిథిలాల నుంచి 15 మందిని రక్షించారు. గాయపడిన వారిని బీడీబీఏ మునిసిపల్ జనరల్‌ ఆసుపత్రికి తరలించారు.

భారీ వర్షాలకు నానడం వల్లే భవనం కూలిపోయిందని మహారాష్ట్ర మంత్రి అస్లాం షేక్ తెలిపారు. ముందుజాగ్రత్తగా ఆ భవనం సమీపంలో ఉన్న పలు పురాతన భవనాలను అధికారులు ఖాళీ చేయించారు. ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ భవనం వయసు ఎంత? ఎన్ని సంవత్సరాల కింద కట్టారు? శిథిలావస్థలో ఉండడం వల్లే కూలిపోయిందా? లేదంటే నాణ్యత లేకపోవడం వల్ల ప్రమాదం సంభవించిందా? అనే కోణాలో ఆరా తీస్తున్నారు.

కాగా.. భారీ వర్షాలవల్లే భవనం కుప్పకూలినట్లు మహారాష్ట్ర మంత్రి అస్లాం తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యగా అధికారులు సమీప భవనాల్లో ఉంటున్న ప్రజలను ఖాళీ చేయించారు

Latest News

ఆనందయ్య మందు ఫిలింఛాంబర్‌లో పంపిణీ. ఏ విధంగా వేసుకోవాలి, ఏం తినకూడదో చెప్తూ వివరణ

సినీ ఇండస్ట్రీలో చాలా మంది ఆనందయ్య మందు పంపిణి చేయమని కోరుతున్నారు. అందరి కోరిక మేరకు కరోనా నియంత్రణలో భాగంగా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్...

More Articles Like This