Tuesday, July 27, 2021

పెద్దపల్లి: నవ వధువు కిడ్నాప్ .. వరుడు పోలీసులకు ఫిర్యాదు

Must Read

ప్రేమించి పెళ్లిచేసుకున్న జంట పోలీసుల దగ్గరికి వెళ్లడంతో వారు పెద్దలను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి మాట్లాడారు. దీంతో వధువును తీసుకుని వరుడు తన ఇంటికి వెళ్లిపోయారు.

పెద్దలను ఎదురించిన ప్రేమ వివాహం చేసుకుందున్న కోపంతో వధువును అహరించారు. వివరాల్లోకి వెళితే.. కరుణాకర్ అనే యువకుడికి హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్న సమయంలో ఓ యువతితో పరిచయం ఏర్పడింది. ఒకరినొకరు ఇష్టపడటంతో అది ప్రేమగా మారింది. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న ప్రేమ జంట.. ఈ విషయాన్ని పెద్దలకు తెలియజేసింది. అయితే, ఇరు కుటుంబాలూ పెళ్లికి నిరాకరించారు.

మంగళవారం కొంతమంది దుండగులు కరుణాకర్ ఇంటికి వచ్చి అతడి కొట్టి యువతిని తీసుకెళ్లారు. ఈ విషయమై బాధితుడు కరుణాకర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన భార్యను అపహరించి తీసుకెళ్లిన దుండగులను శిక్షించి తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశాడు. అతడి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. యువతి కుటుంబసభ్యులే ఈ పనిచేసినట్టు తెలుస్తోంది.
Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...

More Articles Like This