Thursday, June 24, 2021

తెలంగాణలో దారుణం.. ప్రేమ జంట ఆత్మహత్య

Must Read

నిజామాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అడవి ప్రాంతంలో ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. గత వారం రోజుల నుండి చెట్టుకు ఆ రెండు మృతదేహాలు వేలాడుతూనే ఉన్నాయి. వాటిని ఎవరూ గమనించలేదు. ఈరోజు స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది.

నిజామాబాద్ జిల్లాలోని చండూరు మండలం లక్ష్మీపురం లో ఉన్న అడవి ప్రాంతంలో ఓ ప్రేమ జంట చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలిసిన పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. అంతేకాదు.. మోస్రామ్ మండలం తిమ్మాపూర్ కి చెందిన మోహన్,లక్ష్మి గా వారిని గుర్తించారు పోలీసులు.

వారం రోజుల క్రితమే వారు ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం అందుతోంది. అటు వారం నుండి చెట్లకి వేలాడుతూ మృతదేహాలు ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా ఎవరికీ తెలియదు.

Latest News

ఆనందయ్య మందు ఫిలింఛాంబర్‌లో పంపిణీ. ఏ విధంగా వేసుకోవాలి, ఏం తినకూడదో చెప్తూ వివరణ

సినీ ఇండస్ట్రీలో చాలా మంది ఆనందయ్య మందు పంపిణి చేయమని కోరుతున్నారు. అందరి కోరిక మేరకు కరోనా నియంత్రణలో భాగంగా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్...

More Articles Like This