Saturday, June 19, 2021

అక్కా తమ్ముడి ప్రేమ.. ఒప్పుకొని పెద్దలు.. చివరికి ఏం చేసారంటే?

Must Read

ప్రేమ గుడ్డిది అని ఊరికే అనలేదు, ఈరోజుల్లో వావివరుసలు మరిచిపోయి ప్రేమించుకుంటున్నారు, తల్లిదండ్రులు మంచిగా చదువుకోమని కాలేజీలకు పంపిస్తుంటే, చదువును మర్చిపోయి, ఇష్టం వచ్చినట్లు తిరుగుతున్నారు. డిగ్రీ చదువుతున్న ఓ యువతి సొంత చిన్నాన్న కొడుకును ప్రేమించింది. అంతేకాకుండా అతడితో ఆమె వెళ్ళి పోయింది, ఇ ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే..

మెదక్ జిల్లా కేంద్రంలో ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ ఫైనలియర్ చదువుతున్న ఓ విద్యార్థిని తన చిన్నాన్న కొడుకు తో ప్రేమలో పడింది. అంతేకాకుండా అతడి తో చెట్టాపట్టాలు వేసుకొని, బయట తిరగడం మొదలు పెట్టారు. కరోనా నేపథ్యంలో వేసవి సెలవులు రావడంతో ఇంటివద్దే ఉంటున్న, వీరు ఖాళీ సమయంలో ఇలా బయటికి వెళ్లేవారు. రెండు రోజుల క్రితం ఆ విద్యార్థిని ఇంట్లో ఉండగా ఆమె వద్ద తన నానమ్మను సెక్యూరిటీ గా పెట్టి, ఆమె తల్లిదండ్రులు పనులకు వెళ్లారు. ముందుగానే ప్లాన్ చేసుకున్న వాళ్లు, ఆమె నాన్నమ్మకు మామిడి తోట ను చూసి వస్తానని ఇంట్లో అబద్ధం చెప్పి వెళ్ళింది. ఎంతకూ ఇంటికి రాకపోవడంతో ఆరాతీయగా తన చిన్న కొడుకు తో వెళ్లిపోయినట్లు తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఏం చేయాలో అర్థం కాక కన్నీరుమున్నీరయ్యారు.

మంచి సంబంధం వస్తే పెళ్లి చేద్దామనుకున్నాను, అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం టెక్నాలజీ ఎంత వేగంగా విస్తరిస్తోంది, అంతే వేగంగా యువత పెడదోవ పడుతున్నారు. మంచి కంటే ఎక్కువగా చెడుని తీసుకుంటున్నారు, ప్రేమించుకోవడం తప్పు కాదు, కానీ ఆ ప్రేమ వావి వరుస లేకుండా చేసుకుంటున్నారు. సొంత వాళ్ళని లవ్ చేస్తూ ఊర్లో కన్న తల్లిదండ్రుల పరువు తీస్తున్నారు. కాలేజీలకు పాఠశాలకు పంపేటప్పుడు, కొంచెం కనిపెట్టుకుని ఉంటూ ఉంటే ఇలాంటివి జరగకుండా ఉంటాయని, పోలీసులు తెలిపారు

Latest News

వ్యాక్సిన్ తీసుకున్నాక ఆ పని చేయ‌వ‌చ్చా?

క‌రోనా కేసులు క్ర‌మంగా తగ్గుముఖం ప‌డుతున్నాయి. వ్యాక్సినేష‌న్‌ను వేగవంతం చేయ‌డంతో క్ర‌మంగా కేసులు తగ్గుతున్నాయి. అయితే, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక వ్యాయామం చేస్తే ఏమౌతుంది అనే...

More Articles Like This