Friday, July 30, 2021

భారతదేశంలో మళ్లి పెరిగిన పెట్రోల్ ధరలు…

Must Read

మన దేశంలో గత కొన్ని నెలలుగా పెట్రోల్ ధరలు భగ్గుమంటున్నాయి. ప్రజలు వాహనాల మీద తీరగాలంటే భయపడుతున్నారు. మళ్లి పెరిగిన పెట్రోల్ ధరల వివరాలు…

ప్రస్తుతం దేశంలో పెట్రో ధ‌ర‌లు పెరుగుదల సామాన్యుడికి చుక్క‌లు చూపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో సెంచ‌రీ కూడా దాటేశాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ పై 23 పైసలు, లీటర్ డీజిల్ పై 30 పైసలు పెరిగింది. ఈ పెరుగుదలతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 98.81 చేరగా.. లీటర్ డీజిల్ ధర రూ. 89.18 కు చేరింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో సెంచరీకి చేరింది. లీటర్ పెట్రోల్ ధర రూ. 104.90 చేరగా.. డీజిల్ ధర రూ. 96.72 కు చేరింది. ఇక హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ. 102.69 చేరగా.. డీజిల్ ధర రూ. 97.20 కు చేరింది. ఇటు ఏపీలోని కొన్ని జిల్లాల్లో పెట్రోల్ ధరలు సెంచరీ కొట్టిన సంగతి తెలిసిందే. విజయవాడ విషయానికి వస్తే లీటర్ పెట్రోల్ ధర రూ. 104.82 గా నమోదైంది.

Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...

More Articles Like This