Saturday, June 19, 2021

మోడీ గుడ్ న్యూస్: ఫ్రీగా గ్యాస్ సిలిండర్, గ్యాస్ స్టవ్ కూడా..!

Must Read

మీరు కొత్త గ్యాస్‌ కనెక్షన్‌ తీసుకోవాలని అనుకుంటున్నారా.? అయితే మీకో గుడ్‌న్యూస్‌. మీకు బీపీఎల్‌ కార్డు ఉంటే ఉచితంగానే గ్యాస్‌ కనెక్షన్‌ పొందవచ్చు. కేంద్ర ప్రభుత్వం ఈ నెల నుంచే కోటి ఉచిత గ్యాస్‌ కనెక్షన్‌లు ఇచ్చే అవకాశం ఉంది. ఫిబ్రవరి 1 నాటి బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన పథకం కింద ఉచితంగానే మరో కోటి కొత్త గ్యాస్ కనెక్షన్లు అందిస్తామని వెల్లడించారు. అయితే ఇంకా ఈ నిర్ణయం అమలులోకి రాలేదు.

తాజా సమాచారం ప్రకారం.. ఈనెల నుంచే ఉచిత గ్యాస్‌ కనెక్షన్లు అందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదే జరిగితే చాలా మంది పేదలకు ఎంతో మేలు జరగనుంది. కేంద్ర ప్రభుత్వం ఉజ్వల స్కీమ్ కింద 2021 జనవరి చివరి నాటికి 8.3 కోట్ల ఎల్‌పీజీ కనెక్షన్లు అందించినట్లు సమాచారం.

అయితే కొత్తగా గ్యాస్ సిలిండర్ కనెక్షన్ తీసుకోవాలని అనుకుంటే.. రూ.3,200 ఖర్చు అవుతుంది. అయితే మీరు ఉజ్వల స్కీమ్ కింద ఎల్‌పీజీ కనెక్షన్ పొందితే రూ.1600 సబ్సిడీ వస్తుంది. కేంద్రం ఈ డబ్బులు చెల్లిస్తుంది. ఇక మిగిలిన రూ.1600 ఆయిల్ కంపెనీలు ఇస్తాయి. అయితే కస్టమర్లు EMI రూపంలో ఈ 1600 తర్వాత ఆయిల్ కంపెనీలకు కట్టేయాలి.

Latest News

వ్యాక్సిన్ తీసుకున్నాక ఆ పని చేయ‌వ‌చ్చా?

క‌రోనా కేసులు క్ర‌మంగా తగ్గుముఖం ప‌డుతున్నాయి. వ్యాక్సినేష‌న్‌ను వేగవంతం చేయ‌డంతో క్ర‌మంగా కేసులు తగ్గుతున్నాయి. అయితే, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక వ్యాయామం చేస్తే ఏమౌతుంది అనే...

More Articles Like This