Tuesday, July 27, 2021

ఫీజులు కట్టాలని స్కూళ్ళ యాజమాన్యాలు తల్లితండ్రులపై ఒత్తిడి…

Must Read

అసలే కరోనా కాలంలో ఉపాధిలేక ఇబ్బందిపడుతున్నారు ప్రజలు. ఈ సమయంలో స్కూలు ఫీజుల కోసం తల్లిదండ్రులపై ఒత్తిడి పెంచుతున్నాయి కొన్ని ప్రైవేట్ స్కూళ్ళ యాజమాన్యాలు. ఫీజు కట్టకపోతే ఆన్ లైన్ క్లాస్ లింక్ లు ఆపివేస్తామని బెదిరిస్తున్నారు. ఇంకా పై తరగతులకు ప్రమోట్ చేయమని హెచ్చరిస్తున్నాయి. దాంతో ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలపై డీఈవో కార్యాలయానికి భారీగా ఫిర్యాదులు వస్తున్నాయి.

ప్రజలు ఇబ్బంది పడుతున్న ఈ కష్టకాలంలో స్కూల్స్ యాజమాన్యాలు ఈ విధంగా ఇబ్బంది పెడితే మా పరిస్థితి ఎంటి? అని తల్లితండ్రులు ప్రశ్నిస్తున్నారు. అయితే ఫీజులపై ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు రాలేదు. కానీ తల్లిదండ్రులపై ఫీజుల విషయంలో ఒత్తిడి చేస్తే స్కూల్ యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటాం అని డీఈఓ లింగారెడ్డి స్పష్టం చేసారు.

Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...

More Articles Like This