Friday, July 30, 2021

సర్వీస్ రివాల్వర్ మిస్సింగ్ కేసులో సబ్-ఇన్స్‌పెక్టర్‌ సస్పెండ్!

Must Read

ప్రజల వస్తువులకు రక్షణగా ఉండాల్సిన పోలీసులే నిర్లక్ష్యంగా వ్యహరిస్తున్నారు. ఓ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ తన సర్వీసు రివాల్వర్‌‌నే పోగొట్టుకున్నాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది. దీంతో ఆయనను విధుల నుంచి తప్పించారు ఉన్నతాధికారులు. బదిలీ అవుతున్న సమయంలో తుపాకీ అప్పగించకుండా రిలీవ్‌ అయినందుకు సంబంధిత ఎస్‌ఐపై అనంతపురం రేంజ్‌ డీఐజీ కాంతి రాణా టాటా చర్యలు తీసుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా.. అనంతపురం జిల్లా ధర్మవరం రూరల్‌ పోలీసు స్టేషన్‌లో ఎస్‌ఐగా పనిచేస్తున్న జనార్దన్‌ నాయుడిని తిరుపతి అర్బన్‌ జిల్లా పరిధిలోని తిరుపతి తూర్పు పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేశారు. అయితే, ధర్మవరం రూరల్‌ పీఎస్‌లో కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఎస్‌ఐకి సర్వీసు రివాల్వర్‌ అందకపోవడంతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.

డీఐజీ ఆదేశాల మేరకు జరిగిన విచారణలో తుపాకి అప్పగించలేదని.. రికార్డుల్లో నమోదు చేయలేదని తేలింది. స్టేషన్‌లో కూడా తుపాకీ లేదని నిర్ధారించుకున్న ఉన్నతాధికారులు.. జనార్దన్‌ నాయుడిని విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.  ధర్మవరం రూరల్‌లో ఉన్నంతకాలం సర్వీసు రివాల్వర్‌ తీసుకోవడం..అప్పగించే విషయంలో అలసత్వం ప్రదర్శించినందుకు చర్యలు చేపట్టారు. కనిపించని తుపాకీ కోసం దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.

అనంతపురం జిల్లా క్రైమ్‌ పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐగా జనార్దన్‌ నాయుడు పనిచేసే సమయంలో కీలకమైన కేసులను ఛేదించారు. వారి నుంచి ఎస్‌ఐకి ప్రాణహాని ఉండటంతో సొంత తుపాకీ అనుమతులు తీసుకుని వినియోగించారు. అక్కడ నుంచి ధర్మవరం రూరల్‌కు మారినప్పుడు అదే తుపాకీ వినియోగిస్తూ వచ్చారు. తిరుపతికి బదిలీ కావడంతో అలాగే వచ్చి విధుల్లో చేరిపోయారు

Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...

More Articles Like This