Wednesday, June 23, 2021

జూన్ 10 సూర్యగ్రహణం , కొడుకులు ఉన్న వారు తప్పకుండా ఇలా చేయండి

Must Read

అంతు చిక్కని ఆ ఆకాశంలో ఎన్నో వింతలు.. అయితే అంతే లేని అంతరిక్షంలో మరో అద్భుతం చోటు చేసుకోనుంది. ఈ ఏడాది తొలి చంద్ర గ్రహణం ముగిసిన రెండో వారంలో సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఈ సంవత్సరానికి ఇవి తొలి సూర్యగ్రహణ రోజులు. ఈ నెల 10వ తేదీ సూర్యగ్రహణం ఏర్పడనుంది. సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే సరళరేఖపై ఉన్న సమయంలో సూర్యుడు, భూమికి మధ్య చంద్రుడు వస్తాడు. అప్పుడు సూర్యుడి నీడ భూమిపై పడుతుంది. ఈ అంతరిక్ష అద్భుతం పలు దేశాల్లో కనిపిస్తుంది. పాక్షికమే అయినప్పటికీ..కొన్ని దేశాలు రింగ్ ఆఫ్ ఫైర్ను చూడగలుగుతాయి. భారత్లో ఈ సూర్యగ్రహణం మధ్యహ్నం ఒంటిగంటా 42 నిమిషాలకు ఆరంభమౌతుంది. సాయంత్రం 6:41 నిమిషాలకు ముగుస్తుంది. గ్రహణం సమయం ఆరంభం నుంచి పూర్తి ఆ ఛాయ తొలగిపోవడానికి దాదాపు ఆరు గంటల పాటు పడుతుంది.

సూర్య గ్రహణం రోజు ఏం చేయాలి అనేది చూద్దాం, పురాణాల ప్రకారం సూర్య గ్రహణం సమయంలో మంత్రాలు జపించాలి అవి ఏదైనా సరే పర్వాలేదు మంత్రాలను రానివారు కనీసం దేవుడి నామ స్మరణ చేయాలి. కులదైవాన్ని ఇష్ట దైవాన్ని పూజించాలి. సూర్యగ్రహణ ప్రారంభానికి ముందు ఇల్లంతా శుభ్రం చేయాలి. సూర్యగ్రహణం పూర్తయిన తర్వాత మల్లి ఇల్లు శుభ్రం చేసుకోవాలి. దేవుని పటాలను కూడా పూర్తిగా కడగాలి. మంచినీటితో ఇంటిని శుద్ధంచేసి, శుద్ధ జలాలు చల్లాల. మీరు తినే ఆహారం తాగే ద్రవాలు తులసి ఆకులు కచ్చితంగా జత చేయండి. మీ ఇంట్లో పిల్లలు చిన్న వాళ్ళు అయితే ఎట్టి పరిస్థితిలో వారిని సూర్య గ్రహణం సమయంలో బయటికి వదలకండి. ఇక వివాహమైన వాళ్లు చాలా జాగ్రత్తగా ఉండండి. అంతే కాకుండా ప్రెగ్నెంట్ అయిన వారు సూర్య గ్రహణ సమయంలో ఇంట్లో నుంచి బయటకు రాకండి. సూర్యగ్రహణం నీడ ఎట్టి పరిస్థితిలో గర్భం పై పడకుండా చూసుకోవాలి అంటున్నారు పండితులు. కొంతమంది సైన్సు నమ్మేవారు దీన్ని పట్టించుకోరు, కొంతమంది మాత్రం పండితులు చెప్పే దాన్ని పట్టించుకుంటారు, ఎవరి అభిప్రాయం వారిది.

అయితే ఇంట్లో పూజగది ఉంటే దానిపై సూర్యగ్రహణం నీడ పడకుండా చూసుకోవాలి. డోర్లు కిటికీలు మూసి వేయాలి లేదంటే కర్టెన్ వేసి ఉంచాలి. సూర్య గ్రహణం తర్వాత ఇంట్లో ఉండే తాగునీటిని మార్చి కొత్త నీటిని తెచ్చుకోవాలి. గ్రహణం ముగిశాక తలస్నానం చేయాలి పూర్తిగా స్నానం చేయాలి. ఇక ఆ తర్వాత మాత్రమే దైవారాధన చేయడం చాలా మంచిది. విరాళాలు దానాలు చేయాలంటే సూర్యగ్రహణానికి ముందే వాటిని ఇంట్లో నుండి బయట పెట్టుకోవడం, గ్రహణం వాటి మీద పడకుండా చూసుకోవాలి గ్రహణం ముగిశాక వాటిని దానం చేస్తే చాలా మంచిది. ఇక పండితులు చెప్పే దాని ప్రకారం సూర్య గ్రహణం సమయంలో గర్భిణీలు వంటలు చేయకూడదు. ఎలాంటి ఆహారం తీసుకోకూడదు ద్రవ ఆహారం మాత్రమే తీసుకోవాలి. సూది, దారం ఈ సమయంలో వాడకూడదు. గ్రహణం లో ఏమి తినకూడదు. ఈ సమయంలో ప్రారంభమయ్యాక నిద్రపోకూడదు. పిల్లలు,ముసలి వాళ్ళు ఇంట్లో అనారోగ్యంతో ఉన్నవారు మాత్రమే పడుకోవచ్చు. సూర్యగ్రహణం ప్రారంభమయ్యాక తులసి ఆకులను, గడ్డి తెంపకూడదు. గ్రహణానికి ముందు ఎలాంటి మొక్కలు తెంపకూడదు లేదా గ్రహణం పూర్తయిన రోజు ఎలాంటి మొక్కలను కూడా తీయకూడదు. గ్రహణ సమయంలో దేవుళ్ళు,దేవతలా విగ్రహాలను, పాఠాలను ముట్టుకోకూడదు. ఆ సమయంలో పూజలకు దూరంగా ఉండాలి. ఈ సమయంలో గ్రహణం రోజు ఎలాంటి కొత్త వ్యాపార వ్యవహారాలు స్టార్ట్ చేయకూడదు. ఎలాంటి శుభకార్యాలు అయినా సరే ఈ సమయంలో మొదలుపెట్టకూడదు. మాంసం ఈ రోజు ముట్టుకోకూడదు, మద్యం తాగకూడదు. ఇలా చేస్తే సమస్యలు తప్పవు.

మామూలు కళ్ళతో సూర్యగ్రహణాన్ని చూస్తే కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉంది. సూర్య గ్రహణం సమయంలో కొత్తగా ఏ పని చేయకూడదు అయితే ఈ సూర్యగ్రహణం సమయంలో కొన్ని కీలకమైనటువంటి విషయాలను తెలియజేస్తున్నారు, చాలామందికి శని బాధ అనేది ఉంటుంది, ఈ శనిబాధ ఉన్నటువంటి వారు ఈ ఏడాది కచ్చితంగా సంపూర్ణ సూర్యగ్రహణం రోజు ఒక రాగి చెంబులో నీటిని గ్రహణానికి ముందు పూర్తిగా పోసేయండి, అందులో ఉండేటువంటి నీటిని గ్రహణం పూర్తయిన తర్వాత రావి చెట్టు దగ్గరకు వెళ్లి అక్కడ ఈ చెంబుడు నీళ్లును రావిచెట్టు మొదట్లో పోస్తే మీరు ఏదైనా ఒక గట్టి కోరిక కోరుకుంటే అది కచ్చితంగా నెరవేరుతుంది అంటున్నారు పండితులు. సూర్యగ్రహణ సమయంలో పట్టువిడుపు అనేది ఖచ్చితంగా ఉంటాయి. అలాగే మన కోరికలు కూడా అదే విధంగా పట్టువిడుపులు ఉండాలి కాబట్టి ఈ కోరిక కోరుకుంటే కచ్చితంగా మీకు నెరవేరుతుంది అంటున్నారు పండితులు.

Latest News

ఆనందయ్య మందు ఫిలింఛాంబర్‌లో పంపిణీ. ఏ విధంగా వేసుకోవాలి, ఏం తినకూడదో చెప్తూ వివరణ

సినీ ఇండస్ట్రీలో చాలా మంది ఆనందయ్య మందు పంపిణి చేయమని కోరుతున్నారు. అందరి కోరిక మేరకు కరోనా నియంత్రణలో భాగంగా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్...

More Articles Like This