Friday, July 30, 2021

రేపే సంపూర్ణ సూర్యగ్రహణం.. ఏ సమయంలో కనిపిస్తుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

Must Read

మొన్ననే సంపూర్ణ చంద్రగ్రహణం వచ్చింది… నారింజ రంగు చందమామను ప్రజలు చూశారు. ఇప్పుడు జూన్‌లో సంపూర్ణ సూర్య గ్రహణం రాబోతోంది. జూన్ 10 ఆకాశంలో ఈ అద్భుతం జరగబోతోంది. ఆ రోజున సూర్యుడు, భూమి మధ్యకు చందమామ రాబోతోంది. అందువల్ల సూర్య కిరణాలు చందమామపై పడతాయి. చందమామ నీడ భూమిపై పడుతుంది.

ఫలితంగా భూమిపై ఉన్న వారికి సూర్యుడు కనిపించడు. ఇలా చందమామ సూర్యుడికి పూర్తిగా అడ్డుగా వచ్చినప్పుడు… చందమామ చుట్టూ… ఓ రింగ్ లా ఏర్పడుతుంది. దాన్నే రింగ్ ఆఫ్ ఫైర్ అంటున్నారు. అది చాలా కాంతి వంతంగా మెరుస్తూ ఉంటుంది. ఈసారి సూర్య గ్రహణం గంటకు పైగా ఉంటుంది.

భారత్‌లో ఈ సూర్యగ్రహణం మధ్యహ్నం ఒంటిగంటా 42 నిమిషాలకు ఆరంభమౌతుంది. సాయంత్రం 6:41 నిమిషాలకు ముగుస్తుంది. గ్రహణం సమయం ఆరంభం నుంచి పూర్తి ఆ ఛాయ తొలగిపోవడానికి దాదాపు ఆరు గంటల పాటు పడుతుంది. టైమ్ అండ్ డేట్ అనే వెబ్‌సైట్ వేసిన అంచనాల ప్రకారం.. భారత్‌లో ఇది కనిపించదు. రష్యా, గ్రీన్‌ల్యాండ్, కెనడా ఉత్తర ప్రాంతంలల్లో పాక్షికంగా కనిపిస్తుంది. ఆసియా ఉత్తర ప్రాంత దేశాలు, ఆఫ్రికా పశ్చిమ ప్రాంత దేశాలు, అట్లాంటిక్, ఆర్కిటిక్, యూరప్, అమెరికా దేశాల్లోనూ పాక్షికంగా కనిపిస్తుంది సూర్యగ్రహణం.

ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి క్రింది వీడియో చూడండి:

Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...

More Articles Like This