Saturday, June 19, 2021

హైదరాబాద్ ఆకాశంలో అద్భుతం.. షాక్ అవుతున్న ప్రజలు

Must Read

హైదరాబాద్ లో ఆకాశంలో వింత ఘటన చోటు చేసుకుంది. సూర్యుడి చుట్టూ ఇంద్ర ధనస్సు కాంతి వలయంగా ఏర్పడింది. ఈ దృశ్యం ప్రజలను ఎంతో ఆకట్టుకుంటోంది. ఆకాశంలో మేఘాలు ఎక్కువగా ఉన్న సమయంలో వాటిలోని నీటి బిందువులపై పడిన కాంతి కిరణాలు వక్రీభవనం చెందడం వల్ల ఈ తరహా వలయాలు ఏర్పడుతూ ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

హైదరాబాద్ నగరంలోని చాలాచోట్ల ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు వచ్చి ఈ క్రాంతి వలయాన్ని వీక్షిస్తున్నారు. తమ మొబైల్ ఫోన్ లలో ఫోటోలు, వీడియోలు తీస్తున్నారు. సూర్యుడి చుట్టూ ఇంద్రధనస్సులా ఏర్పడిన ఈ వలయాన్ని సైన్స్ భాషలో ‘హ్యాలో సినామినా’ అని పిలుస్తారని అధికారులు వెల్లడించారు.

Latest News

వ్యాక్సిన్ తీసుకున్నాక ఆ పని చేయ‌వ‌చ్చా?

క‌రోనా కేసులు క్ర‌మంగా తగ్గుముఖం ప‌డుతున్నాయి. వ్యాక్సినేష‌న్‌ను వేగవంతం చేయ‌డంతో క్ర‌మంగా కేసులు తగ్గుతున్నాయి. అయితే, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక వ్యాయామం చేస్తే ఏమౌతుంది అనే...

More Articles Like This