Tuesday, July 27, 2021

శ్రీశైలం డ్యాం వద్దకు చేరుకున్న తెలంగాణ పోలీసులు… వాహనలు తనిఖీలు

Must Read

శ్రీశైలం డ్యాం ఎడమగట్టు గేటు వద్ద పహార కాస్తున్నారు తెలంగాణ పోలీసులు. రెండు రాష్ట్రాల వివాదం నేపథ్యంలో శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రం వద్ద కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. శ్రీశైలం జలాశయంలోని నీటి వినియోగంపై వివాదం నేపథ్యంలో భద్రత కల్పిస్తున్నారు. ఎడమగట్టు విద్యుత్ కేంద్రం లోకి వెళ్లే వాహనాలను, సిబ్బందిని క్షుణ్ణంగా పరిశీలించి పంపుతున్నారు పోలీసులు. శ్రీశైలండ్యాం వద్దకు భారీగా చేరుకున్నారు తెలంగాణ పోలీసులు.

శ్రీశైలం డ్యాం వద్ద క్రమక్రమంగా వరద నీరు తగ్గుతుంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయానికి వరద తగ్గుతుంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో ఇన్ ఫ్లో 14,314 క్యూసెకులు ఉండగా ఔట్ ఫ్లో మాత్రం 28,252 గా ఉంది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885.00 అడుగులు కాగా ప్రస్తుతం 823.50 అడుగులుగా ఉంది. పూర్తిస్దాయి నీటి నిల్వ 215.8070 టిఎంసీలు కాగా ప్రస్తుతం 43.5460 టీఎంసీలు ఉంది. ఇక ప్రస్తుతం ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రం లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది.

Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...

More Articles Like This