Saturday, June 19, 2021

బంపర్ ఆఫర్: వ్యాక్సిన్ తీసుకుంటే కారు ఫ్రీ..

Must Read

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కొన్ని లక్షల మంది ప్రాణాలను బలి తీసుకుంది. దీంతో వైరస్ కు చెక్ పెట్టేందుకు పెద్ద ఎత్తున వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ జరుగుతుంది. చాలా దేశాల్లో ప్రజలు భయంతో వ్యాక్సిన్ తీసుకోవ‌డానికి ముందుకు రావ‌డంలేదు. దీంతో వ్యాక్సిన్ వేయ‌డం ఇప్పుడు కొన్ని దేశాల‌కు స‌వాల్‌గా మారింది.

ముఖ్యంగా హాంకాంగ్‌లో ఈ స‌మ‌స్య ఎక్కువగా ఉం‌ది. సరిపడినన్ని వ్యాక్సిన్లు ఉన్న‌ప్ప‌టికీ వ్యాక్సినేషన్ కోసం ప్ర‌జ‌లు ముందుకు రావ‌డంలేదు. దీంతో ప్రబుత్వం, అధికారులు, వ్యాపారవేత్త‌లు, సామాజిక‌వేత్త‌లు వ్యాక్సినేషన్ కోసం భారీ బ‌హుమ‌తులు ప్ర‌క‌టిస్తున్నారు. వ్యాక్సిన్ తీసుకుంటే బంగారు నగలు ఇస్తామ‌ని, మిలియ‌న్ డాల‌ర్ల డబ్బుని అంద‌జేస్తామ‌ని ఆఫర్స్ ప్రకటిస్తున్నారు.

స‌న్ హ్యాంగ్ కాయ్ ప్ర‌పాప‌ర్టీస్ సంస్థ ఐఫోన్లు ఇస్తామ‌ని ప్ర‌క‌టించ‌గా హాంకాంగ్‌లోని ఆస్ట్రేలియా సంస్థ గుడ్‌మ్యాన్ గ్రూప్ ఆస‌క్తిక‌ర‌మైన బ‌హుమ‌తిని ప్ర‌క‌టించింది. ఆగ‌స్టు 31 లోగా వ్యాక్సినేష‌న్ పూర్తిచేసుకుంటే, లాట‌రీ ద్వారా మిలియ‌న్ హాంకాంగ్ డాల‌ర్ల న‌గ‌దు ఇస్తామ‌ని, అంతేకాకుండా టెస్లా మోడ‌ల్ 3 కారును కూడా అందిస్తామని ప్ర‌క‌టించింది. ఈ ఆఫర్ దెబ్బకి జనాలు వ్యాక్సినేషన్ సెంటర్లకు పరుగులు పెట్టారు.

Latest News

వ్యాక్సిన్ తీసుకున్నాక ఆ పని చేయ‌వ‌చ్చా?

క‌రోనా కేసులు క్ర‌మంగా తగ్గుముఖం ప‌డుతున్నాయి. వ్యాక్సినేష‌న్‌ను వేగవంతం చేయ‌డంతో క్ర‌మంగా కేసులు తగ్గుతున్నాయి. అయితే, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక వ్యాయామం చేస్తే ఏమౌతుంది అనే...

More Articles Like This