Tuesday, July 27, 2021

దొంగతనానికి వచ్చి కర్ర విరగడంతో ప్రాణాలు కోల్పోయిన బాలుడు

Must Read

దొంగతనం కోసం వచ్చి ప్రాణాలు కోల్పోయాడు ఓ బాలుడు . అతని సహచర దొంగ బాలుడి మృతదేహాన్ని ఘటనాస్థలంలోనే వదిలి పారిపోయాడు. ఆత్మహత్య చేసుకున్నాడంటూ పోలీసులకు సమాచారం అందించాడు. ఈ సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. అసలు విషయాన్ని గ్రహించి ఫోన్ చేసిన చెప్పిన సహచర దొంగను అదుపులోకి తీసుకున్నారు. ఏంటి సంగతి అని అతన్ని పోలీసులు తమదైన స్టైల్‌లో విచారించగా.. మ్యాటర్ మొత్తం పూస గుచ్చినట్లు చెప్పేశాడు. అతని చెప్పిన విషయాలు విని పోలీసులు సైతం షాక్‌కు గురయ్యారు. కాగా, చనిపోయిన బాలుడు సహా షాబాజ్ ఖాన్‌ దొంగతనాలకు అలవాటు పడ్డారని, వీరిపై ఇంతకుముందే అనేక కేసులు ఉన్నాయని పోలీసు అధికారులు తెలిపారు.

చనిపోయిన 16 సంవత్సరాల బాలుడు మరియు షాబాజ్ ఖాన్(21) ఇద్దరూ దొంగతనాలు చేస్తుండే వారు. ఈ క్రమంలోనే వాషినాకాలోని ఎంహెచ్ఏడీఏ కాలనీలో జనసంచారం పెద్దగా లేని ఇంటిని టార్గెట్‌గా చేసుకుని దొంగతనానికి ప్రణాళికలు వేశారు. అయితే, దోపిడీ చేయాల్సిన ఇంట్లోకి వెళ్లంటే.. మరో బిల్డింగ్ నుంచి వెళ్లా్ల్సి ఉంటుంది. దాంతో వారు వెదురు కర్రపై నడుచుకుంటూ ఒక బిల్డింగ్ లోంచి మరో బిల్డింగ్‌లోకి వెళ్లాలని ప్లా్న్ చేసుకున్నారు. అయితే, 16 ఏళ్ల బాలుడు బరువు తక్కువగా ఉండటంతో.. నువ్వైతేనే కరెక్ట్, బరువు తక్కువగా ఉండటం వల్ల కర్రపై నడుచుకుంటూ వెళ్లొచ్చంటూ షాబాజ్ ఖాన్ అతన్ని ఒప్పించాడు. అలా ఆ బాలుడు కర్ర సాయంతో అవతలి బిల్డింగ్‌లోకి ప్రవేశించి మూడు సెల్‌ఫోన్లను దొంగిలించాడు. అనంతరం తిరిగి వస్తుండగా.. మధ్యలో వెదరు కర్ర విరిగిపోయింది. దాంతో ఆ బాలుడు ఐదవ అంతస్థు నుంచి కిందపడిపోయి ప్రాణాలు కోల్పోయాడు.

గాయపడిన బాలుడిని తోపుడు బండిపై వేసి ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. కానీ అప్పటికే చనిపోవడంతో మృతదేహాన్ని అక్కడే వదిలేసి పారిపోయాడు. ఆ తరువాత, పోలీసులకు ఫోన్ చేసి పలానా ప్రాంతంలో బాలుడు ఆత్మహత్య చేసుకుని చనిపోయాడంటూ సమాచారం అందించాడు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రాథమిక దర్యాప్తు చేపట్టారు. దొంగతనం సందర్భంగా ఈ ఘటన జరిగిందని గుర్తించిన పోలీసులు.. తమకు సమాచారం ఇచ్చిన షాబాజ్ ఖాన్‌ను అరెస్ట్ చేశారు. అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...

More Articles Like This