Tuesday, July 27, 2021

రెస్టారెంట్‌ బిల్లు మూడు వేలు..టిప్పు 12 లక్షలు ఇచ్చిన కస్టమర్

Must Read

అమెరికాలో ఓ రెస్టారెంట్‌లో కస్టమర్ భారీ మొత్తంలో టిప్ ఇచ్చాడు. మనం రెస్టారెంట్‌కు వెళ్తే బిల్లు చెల్లించే సమయంలో సర్వర్‌కు టిప్పు ఇస్తూ ఉంటాం. చాలామంది తాము బిల్లు చెల్లించేటప్పుడు ఎంతోకంత నగదును టిప్పుగా ఇస్తుంటారు. కొందరు మాత్రం అసలేమీ ఇవ్వకుండానే బయటకు వస్తుంటారు. అయితే.. అమెరికాలో ఓ ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది.

ఓ అనామిక వ్యక్తి తాను చెల్లించాల్సిన బిల్లు కంటే దాదాపు 400 రెట్ల డబ్బును టిప్పుగా ఇచ్చి.. వార్తల్లో నిలిచాడు. న్యూ హాంప్‌షైర్‌లోని స్టంబుల్‌ ఇన్‌ బార్ అండ్‌ రెస్టారెంటుకు ఇటీవలనే ఓ కస్టమర్‌ వచ్చాడు. ఓ పానీయం, మరికొన్ని ఆహార పదార్థాలను ఆర్డర్‌ చేశాడు. వాటికి బిల్లు కేవలం 37 డాలర్లు (సుమారు రూ.2700) మాత్రమే అయ్యింది. ఈ బిల్లు రసీదును రెస్టారెంటులో వెయిటర్‌గా పని చేస్తున్న ఓ మహిళ అయనకు ఇచ్చింది. దానిపై ఆ కస్టమర్‌ టిప్పుగా 16 వేల డాలర్లు (సుమారు రూ.11 లక్షలు) ఇస్తున్నట్లు రాశాడు.

సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లంతా ఆ కస్టమర్‌ను పొగడ్తలతో ముంచెత్తుతూ అభినందిస్తున్నారు. ఈ సంఘటన అమెరికాలోని న్యూ హాంప్‌షైర్‌లోని ఓ రెస్టారెంట్‌లో జరిగింది. అయితే.. బిల్లు ఫొటోను రెస్టారెంట్ యజమాని ఫేస్‌బుక్‌లో పోస్టు చేయడంతో అది కాస్త వైరల్‌గా మారింది.

Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...

More Articles Like This